బిహార్ అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గురువారం పట్నా నుంచి దిల్లీకి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్... తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో(Tejas rajadhani express) ప్రయాణించారు. అయితే.. ఆ సమయంలో ఆయన లోదుస్తులు(Mla in undergarments) మాత్రమే ధరించి రైలులో కూర్చొని ప్రయాణం చేశారు.
ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. అయితే.. రైల్వే పోలీసులు, టీటీఈ అధికారులు... ఇరు వర్గాలతో చర్చించి సమస్య పరిష్కరించారని తూర్పు మధ్య రైల్వే తెలిపింది.
'అందుకే అలా ప్రయాణించాను'
ఎమ్మెల్యే గోపాల్ మండల్.. తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. కడుపులో ఇబ్బందిగా ఉండటం వల్లే తాను లోదుస్తులు మాత్రమే ధరించి, ప్రయాణించానని చెప్పారు.
అంతకుముందు.. బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్‌కు 'ఐ లవ్యూ' చెప్పి.. ఎమ్మెల్యే గోపాల్ మండల్ వార్తల్లో నిలిచారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు