ఝార్ఖండ్‌లోని బొకారో ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల జయంత్.. పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతకు సరిగ్గా సరిపోతాడు. ఈ బుడతడి క్రికెట్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. చిన్నవయసులోనే బంతిని బౌండరీలు దాటిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీలా మారాలన్నదే తన కల అని చెబుతున్నాడు జయంత్.
ఆట తర్వాతే అన్నం..
జయంత్ రోజూ ఉదయం, సాయంత్రం క్రికెట్ ఆడతాడని అతడి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. క్రికెట్ ఆడకపోతే.. అన్నం కూడా తినడని తెలిపారు. 9 నెలల వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తి కనబరిచాడన్నారు.
ఇదీ చదవండి : ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కార్మికుడి సాహసం!