ETV Bharat / bharat

'బెంగాలీయేతర పార్టీ' వ్యాఖ్యలపై గడ్కరీ మండిపాటు

భాజపా బెంగలీయేతర పార్టీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించటంపై నితిన్​ గడ్కరీ దీటుగా స్పందించారు. భాజపా సిద్ధాంత మూలాలు జన్​సంఘ్​లో ఉన్నాయని, అలాంటి జనసంఘ్​ను స్థాపించింది బెంగాలీ పుత్రుడు శ్యామ్​ప్రసాద్​ ముఖర్జీ అని అన్నారు. అలాంటప్పుడు భాజపా బెంగలీయేతర పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.

GADKARI-RALLY
మమతకు నితిన్​​ గడ్కరీ ధీటైన జవాబు
author img

By

Published : Mar 3, 2021, 9:00 PM IST

భాజపాను బంగాల్​ అవతలి పార్టీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించటంపై కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ దీటైన సమాధానం ఇచ్చారు. భాజపా మాతృకైన జనసంఘ్ స్థాపకులు శ్యామ్​ప్రసాద్​ ముఖర్జీ.. బంగాల్​ పుత్రుడని గుర్తుచేశారు. భాజపాకు దేశ సమైక్యతే ముఖ్యమని, విభజన రాజకీయాలు తమ పార్టీ లక్షణం కాదని ఘట్టిగా బదులిచ్చారు. భాజపా నిర్వహించిన పరివర్థన్​ యాత్రా ర్యాలీలో గడ్కరీ పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

"భాజపాను బంగాల్​ బయటి పార్టీగా మమతా అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి మూలమైన జనసంఘ్​ స్థాపకులు శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ బంగాల్​కు చెందిన వారేనని గుర్తు చేసుకోవాలి. బంగాల్​లో వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్​కు చాలా సంవత్సరాలు అధికారమిచ్చారు. తృణమూల్​కు పది ఏళ్లు అధికారం కట్టబెట్టారు. అయిన బంగాల్లో​ అభివృద్ధి జరగలేదు. పైగా రాష్ట్రంలో హింస, అవినీతి పెచ్చరిల్లాయి."

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితిని, అవినీతిని అంతమెందించాలని భాజపా అనుకుంటోందని, తమ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజల్ని గడ్కరీ కోరారు.

ఇదీ చూడండి: 'బంగాల్​కు కావాల్సింది తమ సొంత కూతురే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.