మహిళా ప్రయాణికులను తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్ గందరబల జిల్లాలో అసోం రైఫిల్స్‌కు(Assam Rifles) చెందిన మహిళా సైనికులను (women soldiers) మోహరించారు. జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కర్నల్ కరకోటి తెలిపారు. క్షేత్ర స్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తారని వెల్లడించారు.

ఆయుధాల చేరవేత..
ఆయుధాలను, మందుగుండు సామగ్రిని మహిళలు అక్రమంగా చేరవేస్తున్నారనే సమాచారంతో ఈ మేరకు మహిళా జవాన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద తమ సహచరులకు స్థానిక మహిళలు సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో 2020 ఆగష్టులోనే మహిళా బలగాలను మోహరించారు. ప్రస్తుతం గందర్బల జిల్లాలో మహిళా బలగాలు మహిళలను తనిఖీలు చేస్తున్నాయి.

"పురుష సైనికుల లాగానే మహిళా సైనికులను ఉపయోగించనున్నాము. స్థానిక ప్రజలతో కలిసిపోయి.. వారిలో చైతన్యాన్ని కలిగించే దిశగా మహిళా సేనలు పనిచేస్తాయి. భద్రతా దళాలకు ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహకరిస్తాయి."
-కర్నల్ కరకోటి
ఇదీ చదవండి: