Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి సూరంకోట్ మండలంలోని సింధారా ప్రాంతంలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారని.. అందులో భాగంగా రాత్రి 11.30 గంటల సమయంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. అనంతరం భద్రతా దళాలు.. డ్రోన్లు, ఇతర పర్యవేక్షణ పరికరాలతో నిఘా ఉంచాయని చెప్పారు.
-
J&K | Four terrorists have been killed by the security forces in a joint operation in the Sindhara area of Poonch. The first engagement between security forces took place at around 11:30 pm yesterday after which drones were deployed along with other night surveillance equipment.…
— ANI (@ANI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">J&K | Four terrorists have been killed by the security forces in a joint operation in the Sindhara area of Poonch. The first engagement between security forces took place at around 11:30 pm yesterday after which drones were deployed along with other night surveillance equipment.…
— ANI (@ANI) July 18, 2023J&K | Four terrorists have been killed by the security forces in a joint operation in the Sindhara area of Poonch. The first engagement between security forces took place at around 11:30 pm yesterday after which drones were deployed along with other night surveillance equipment.…
— ANI (@ANI) July 18, 2023
Jammu Kashmir Terrorists Killed : మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మళ్లీ ప్రారంభమైన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముకేశ్ సింగ్ వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముష్కరులు విదేశీ ఉగ్రవాదులని.. వారి గుర్తించే చర్యలు ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసు దళాలతో పాటు ఇతర దళాలు పాల్గొన్నాయని తెలిపారు.
-
Operation Trinetra II.
— White Knight Corps (@Whiteknight_IA) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
In a major Cordon and Search Operation, acting on specific intelligence four terrorists were eliminated in a Joint Operation by #IndianArmy & @JKP near Sindarah and Maidana villages in tehsil #Surankote of #Poonch district. Along with the terrorists four… pic.twitter.com/OFtSNmdDVs
">Operation Trinetra II.
— White Knight Corps (@Whiteknight_IA) July 18, 2023
In a major Cordon and Search Operation, acting on specific intelligence four terrorists were eliminated in a Joint Operation by #IndianArmy & @JKP near Sindarah and Maidana villages in tehsil #Surankote of #Poonch district. Along with the terrorists four… pic.twitter.com/OFtSNmdDVsOperation Trinetra II.
— White Knight Corps (@Whiteknight_IA) July 18, 2023
In a major Cordon and Search Operation, acting on specific intelligence four terrorists were eliminated in a Joint Operation by #IndianArmy & @JKP near Sindarah and Maidana villages in tehsil #Surankote of #Poonch district. Along with the terrorists four… pic.twitter.com/OFtSNmdDVs
'ఆపరేషన్ త్రినేత్ర-2లో భాగంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో.. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనా స్థలంలో నాలుగు AK-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ రాజౌరీ, పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలపెట్టిన విధ్వంస కార్యక్రమాలను నివారించింది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది' అని భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేసింది.
మాదకద్రవ్యాలతో పాక్ డ్రోన్లు..
మరోవైపు, పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ సరఫరా చేసిన డ్రగ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. 'తార్న్ తరణ్ జిల్లా కల్సియాన్ ఖుర్ద్ గ్రామంలో రాత్రి సమయంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ వ్యవసాయ పొలాల్లో మాదకద్రవ్యాలను పడేస్తుండగా శబ్ధాలు వినిపించాయి. దాని కోసం గాలించగా హెరాయిన్‌తో కూడిన దాదాపు 2.350 కిలోలు ఉన్న మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాం' అని సరిహద్దు భద్రత దళం ట్వీట్ చేసింది.
-
During night hours, #AlertBSF troops heard a Pakistani drone, dropping narcotics in farming fields ahead of border fencing. During search,a consignment (Gross Wt- appx 2.350Kg), containing suspected #heroin, was recovered in Vil- Kalsian khurd, Distt- Tarn Taran#BSFAgainstDrugs pic.twitter.com/UIrY0qiMhX
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">During night hours, #AlertBSF troops heard a Pakistani drone, dropping narcotics in farming fields ahead of border fencing. During search,a consignment (Gross Wt- appx 2.350Kg), containing suspected #heroin, was recovered in Vil- Kalsian khurd, Distt- Tarn Taran#BSFAgainstDrugs pic.twitter.com/UIrY0qiMhX
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) July 18, 2023During night hours, #AlertBSF troops heard a Pakistani drone, dropping narcotics in farming fields ahead of border fencing. During search,a consignment (Gross Wt- appx 2.350Kg), containing suspected #heroin, was recovered in Vil- Kalsian khurd, Distt- Tarn Taran#BSFAgainstDrugs pic.twitter.com/UIrY0qiMhX
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) July 18, 2023
కుప్వారా సెక్టార్లో ఎన్కౌంటర్..
గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లోనూ నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దీంతో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ముష్కరుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.