Jammu Kashmir Encounter: పోలీసులు, సామాన్య పౌరులపై దాడి జరిపిన ఓ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదిని హతం చేసినట్లు స్పష్టం చేశాయి. భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో మృతిచెందిన ఉగ్రవాదిని షహజాద్ అహ్మద్‌గా గుర్తించారు అధికారులు.
'తొలుత ఉగ్రవాదులు బిజ్‌బెహారాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు షహజాద్‌ను గుర్తించి అతడిని లొంగిపొమ్మని కోరారు. దీనికి నిరాకరించిన అతడు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు. తిరిగి సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.' అని ఓ అధికారి తెలిపారు.
గతంలో షహజాద్.. పోలీసు అధికారి మహ్మద్ అష్రఫ్ భట్‌ను, కొందరు పౌరులను హతమార్చడంలో ముఖ్యపాత్ర పోషించాడని అధికారి పేర్కొన్నారు. షహజాద్.. కొందరికి ఆయుధాలు కూడా సరఫరా చేసినట్లు ఆధారాలున్నాయని తెలిపారు.
ఇద్దరు అరెస్టు..
జమ్ముకశ్మీర్‌లోని బుద్గాంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్ర అనుచరులను కూడా అరెస్టు చేశాయి భద్రతా దళాలు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
మాగ్రే మొహల్లా మోచ్వాకు చెందిన ఉగ్ర అనుచరులను ఇమ్రాన్ మజీద్ మాగ్రే, ఆకిబ్ ఆమిన్గా గుర్తించారు అధికారులు. వారి నుంచి రెండు ఏకే-47 తుపాకులను, 30 లైవ్ ఏకే-47 రౌండ్స్, రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: