ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్లు.. ఉగ్రవాదుల 'దొంగదెబ్బ'కు రివెంజ్!​​.. ఇద్దరు ముష్కరులు హతం - రాజౌరి ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లోని బారాముల్లా, రాజౌరీలో జిరిగిన ఎన్​కౌంటర్ల ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, CRPF సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు AK-56 తుపాకీ, 56 బుల్లెట్లు, 3 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు.

jammu kashmir encounter news
jammu kashmir encounter news
author img

By

Published : May 6, 2023, 10:56 AM IST

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శుక్రవారం రాజౌరీ జిల్లా కందీ అటవీ ప్రాంతంలో ముష్కరులు జరిపిన బాంబు దాడిలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. శనివారం ఒక ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఈ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతుండగా జవాన్ల కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడినట్లు తెలుస్తోంది. సైన్యం, జమ్మకశ్మీర్‌ పోలీసులు, CRPF సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు AK-56 తుపాకీ, నాలుగు మ్యాగజైన్లు, 56 బుల్లెట్లు, మరో 9MM తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 3 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజౌరీ వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించనున్నారు.

మరోవైపు బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లా కర్హామా కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన బలగాలపై ముష్కరులు కాల్పులకు దిగారు. అనంతరం జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాది కుల్గామ్‌ జిల్లా యార్హోల్‌ బాబాపొరాకు చెందిన అబిద్‌ వానిగా గుర్తించారు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో ఒక AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఎన్​కౌంటర్​ మధ్యలో పేలుడు.. ఐదుగురు జవాన్లు మృతి
అంతకుముందు శుక్రవారం రాజౌరీలో జరిగిన ఎన్​కౌంటర్​ మధ్యలో ఉగ్రవాదులు జరిపిన పేలుడు కారణంగా ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రాజౌరీ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

ఉదయం నుంచి ప్రత్యేక ఆపరేషన్..
గత నెలలో జమ్ములోని భాటా దురియన్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి ఘటనలో పలువురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి కారణమైన ముష్కరుల పనిబట్టేందుకు ఇండియన్ నార్తర్న్ కమాండ్ కొద్ది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సైన్యానికి కీలక సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారంతో రాజౌరీ సెక్టార్​లోని కండి అటవీ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళం.. కీలక ఆపరేషన్ చేపట్టింది. అడవిలో దాక్కున్న ముష్కరుల కోసం విస్తృతంగా గాలించింది. శుక్రవారం ఉదయం ఏడున్నరకు ఓ గుహలో కొందరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.

ఉగ్రవాదులు, సైనికులకు మధ్య శుక్రవారం పోరు మొదలైంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే.. గుహ లోపల దాగి ఉన్న ముష్కరులు.. అనూహ్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు మేజర్ ర్యాంక్ అధికారి. ఉగ్రవాదుల దాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. ముష్కరులు ఉన్న ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను పంపింది. ముందుజాగ్రత్తగా రాజౌరీ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్​ సేవలు నిలిపివేసింది. క్షతగాత్రుల్ని ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించింది. అయితే.. గాయపడ్డవారిలో ముగ్గురు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.