ETV Bharat / bharat

రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతం - ఉగ్రవాదులు హతం

Jammu kashmir encounter: జమ్ముకశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలో ఇద్దరు, షోపియాన్​ జిల్లాలో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Jammu kashmir encounter
జమ్ముకశ్మీర్ కౌంటర్లు
author img

By

Published : Dec 25, 2021, 6:45 PM IST

Updated : Dec 25, 2021, 8:04 PM IST

Jammu kashmir encounter: జమ్ముకశ్మీర్​లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్​లలో నలుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. షోపియాన్​, పుల్వామా జిల్లాల్లో ఈ ఎన్​కౌంటర్లు జరిగాయి. పుల్వామా జిల్లాలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కర్​-ఏ-తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Pulwama encounter: పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని హర్దుమీర్​లో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. మృతులను నదీమ్ భట్​, ఐఈడీ నిపుణుడు రసూల్ అదిల్​గా అధికారులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ.. అనేక తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని కశ్మీర్ ఐజీపీ తెలిపారు.

Shopian encounter: అంతకుముందు.. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో భద్రతా బలగాల చేతుల్లో ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను బ్రారిపొరా ప్రాంతానికి చెందిన సాజద్​ అహ్మద్ చాక్​, పుల్వామాలోని అచన్ లిట్టర్ ప్రాంతానికి రాజా బాసిత్ యాకూబ్​గా అధికారులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇదీ చూడండి: ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి!

ఇదీ చూడండి: డ్రగ్స్​ ఇచ్చి.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్​​ రేప్​

Last Updated : Dec 25, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.