ETV Bharat / bharat

కశ్మీర్ ఎన్నికలు: తొలిదశ పోలింగ్ ప్రశాంతం

author img

By

Published : Nov 28, 2020, 8:20 AM IST

Updated : Nov 28, 2020, 2:27 PM IST

jammu kashmir ddc polls
జమ్ముకశ్మీర్​ స్థానిక సమరం

14:25 November 28

ముగిసిన తొలి దశ పోలింగ్..

జమ్ముకశ్మీర్​లో డీడీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఓటింగ్​ సజావుగా సాగింది. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. 

12:21 November 28

22.17 శాతం ఓటింగ్ నమోదు..

జమ్ముకశ్మీర్​లో ఉదయం 11 గంటల వరకు 22.12 శాతం పోలింగ్ నమోదైంది.  

  • శ్రీనగర్- 10.64 శాతం
  • జమ్ము- 29.16 శాతం
  • అనంతనాగ్- 23.46 శాతం
  • బారాముల్లా- 12.19 శాతం
  • కుల్గాం- 14.91 శాతం
  • షోపియాన్- 29.34 శాతం
  • పుల్వామా- 3.51 శాతం
  • బందిపొరా- 17.87 శాతం
  • గండర్‌బాల్- 23.14 శాతం
  • బుడ్గామ్​- 28.47 శాతం
  • కుప్వారా- 13.49 శాతం
  • ఉధమ్​పుర్‌- 22.43 శాతం
  • సాంబా- 36.40 శాతం
  • రియాస్‌- 30.34 శాతం
  • రాజౌరి- 33.17 శాతం
  • పూంచ్‌- 33.13 శాతం
  • డోడా- 25.18 శాతం
  • కతువా- 24.26 శాతం
  • రాంబన్‌- 33.39 శాతం
  • కిష్టవర్-​ 14.43 శాతం

12:08 November 28

  • J&K: Polling in the first phase of the District Development Council (DDC) elections underway in Doda district

    "Polls started in Bhalessa & Changa DDC constituencies. People coming since 7am. We're seeing an enthusiastic participation," says Doda District Development Commissioner pic.twitter.com/wh1LoJHB6C

    — ANI (@ANI) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఉత్సాహంగా ఓటింగ్..'

జమ్ముకశ్మీర్​ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని డోడా జిల్లా ఉన్నతాధికారి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు వస్తున్నట్లు చెప్పారు.  

11:38 November 28

  • Jammu and Kashmir: Voters take part in the polling process in the first phase of the District Development Council (DDC) elections in the Garkhal village in Akhnoor, in the Jammu district

    Visuals from a local Garkhal school and the Village Panchayat house pic.twitter.com/ZrobMyEFxu

కొనసాగుతున్న పోలింగ్..

జమ్ముకశ్మీర్​ డీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బందిపొరా, జమ్ము, శ్రీనగర్​, అనంత్​నాగ్​, కుల్గామ్, బుడ్గామ్​ జిల్లాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  

09:58 November 28

  • Jammu and Kashmir: Voters queue to cast their vote in the first phase of District Development Council (DDC) elections, at a polling centre established at Government Secondary School, Raithan in Budgam pic.twitter.com/Y2vhrPipIo

బుడ్గామ్​లో ఓటర్ల బారులు...

జమ్ముకశ్మీర్​లోని బుడ్గామ్​ జిల్లా రైథన్​లో పోలింగ్ కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. 

09:45 November 28

అనంత్​నాగ్​ జిల్లాలో పోలింగ్..

అభివృద్ధి కోసమే ఓటేస్తున్నాం..

తమ ప్రాంతంలో అభివృద్ధి కోసమే ఓటేస్తున్నామని అనంతనాగ్​కు చెందిన స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడికే తెలుసునని అన్నారు. ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నామని, అందుకే ఓటు వేయగలుగుతున్నామని చెప్పారు. పేదవాళ్లకి అధికారం రావాలని కోరుకుంటున్నారు.  

08:59 November 28

  • Jammu and Kashmir: Voting underway for the first phase of District Development Council (DDC) elections in the Union Territory

    Visuals from Shamasabad in Khansahib Tehsil of Budgam district pic.twitter.com/sh8MfYTzBK

ప్రశాంతంగా ఓటింగ్..

జమ్ముకశ్మీర్​ జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల తొలి దశ పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో పటిష్ఠ భద్రత మధ్య ఓటింగ్​ను నిర్వహిస్తున్నారు.  

07:47 November 28

ప్రారంభమైన తొలిదశ ఓటింగ్

అఖ్​నూర్​లో పోలింగ్​..

కశ్మీర్​కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అందులో భాగంగా 43 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(డీడీసీ)లు, సర్పంచ్​ స్థానాలకు ఓటింగ్​ జరుగుతోంది. మొత్తం 8 దశల్లో పోలింగ్​ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మొదటి దశలో.. డీడీసీ, సర్పంచ్​, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్​ జరుగుతోంది. వీటిలో 25 కశ్మీర్​లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి.

ఉగ్ర ముప్పు..!

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Last Updated : Nov 28, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.