కశ్మీర్లో స్థానిక సంస్థల ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.
ఒంటిగంట వరకు మొత్తం 47.43 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ ముగియగా.. ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్నవారికి ఆ తర్వాత కూడా అనుమతించారు. కశ్మీర్ డివిజన్లో 32.41 శాతం, జమ్ము డివిజన్లో 59.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఏడో విడతలో.. జమ్ముకశ్మీర్‌లోని 31 జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో 13 స్థానాలు కశ్మీర్ డివిజన్లో, 18 జమ్ము డివిజన్లో ఉన్నాయి. అలాగే.. 69 సర్పంచ్, 438 పంచ్ స్థానాలకూ ఓటింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి: కేరళ స్థానిక పోరులో అధికార ఎల్డీఎఫ్ జోరు