kashmir bus fire accident: జమ్ముకశ్మీర్ రేసీ జిల్లా కట్రా ప్రాంతంలో బస్సుకు మంటలు అంటుకొని నలుగురు యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. కట్రా నుంచి జమ్ము వెళుతుండగా నొమాయ్ వద్ద బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
![Jammu kashmir bus fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/abuscaughtfireinkatra_13052022171500_1305f_1652442300_728_1305newsroom_1652442717_750.jpg)
![Jammu kashmir bus fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15277699_bus-1.jpg)
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు కట్రా వద్ద బేస్ క్యాంపు ఉంటుంది. బాధితులంతా వైష్ణో దేవిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎండ వేడి కారణంగా బస్సు ఆయిల్ ట్యాంకర్ వద్ద పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, బాంబు పేలుడు జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.
![Jammu kashmir bus fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15277699_bus-2.jpg)
![Jammu kashmir bus fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15277699_bus-3.jpg)
![Jammu kashmir bus fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15277699_bus-4.jpg)
ఇదీ చదవండి: