ETV Bharat / bharat

కేంద్రం పరిధిలోకి జమ్ముకశ్మీర్​ ​అధికారులు - జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా

జమ్ముకశ్మీర్​ కేడర్​కి చెందిన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్​, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అరుణాచల్​ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల (ఆగ్ముత్​) కేడర్​​లోకి రానున్నారు. ఇకపై వీరిని కేంద్రం నేరుగా నియమించనుంది.

j&k cadre now comes under central govt
జమ్ముకశ్మీర్​ ఐఏఎస్​, ఐపీఎస్ అధికారులు కేంద్రం పరిధిలోకి
author img

By

Published : Jan 7, 2021, 10:44 PM IST

జమ్ముకశ్మీర్​కు చెందిన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్​, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఇక కేంద్రమే నేరుగా నియమించనుంది. ఇకపై వీరంతా అరుణాచల్​ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల (ఆగ్ముత్​) కేడర్​​లోకి వస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్రం నిబంధనలు..

జమ్ముకశ్మీర్ విభజనకు ముందు అక్కడ పనిచేస్తోన్న అధికారులు అరుణాచల్​ ప్రదేశ్​, గోవా, మిజోరం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోస్టింగులు పొందుతారు. ఆగ్ముత్​ కేడర్​కి కేటాయించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారని నోటిఫికేషన్‌ పేర్కొంది. అవసరమైతే సంబంధిత కేడర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయవచ్చు.

జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాది తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి రూ.28,400కోట్ల ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.