ETV Bharat / bharat

అక్కడ అల్లుళ్ల పేరున కాలనీ.. ఎందుకంటే? - జమాయ్​ కాలనీ వార్తలు

Jamai Colony Faridabad: హరియాణాలోని ఫరీదాబాద్​ జిల్లాలో ఉన్న ఓ ప్రాంతానికి వింత పేరు చెలామణిలోకి వచ్చింది. అదే జమాయ్​ కాలనీ. స్థానికంగా జమాయ్​ అంటే అల్లుడు అని అర్థం. మరి ఈ కాలనీకి ఈ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం.

Jamai Colony Faridabad
అక్కడ అల్లుళ్ల పేరున ఓ కాలనీనే ఉంది!
author img

By

Published : Dec 8, 2021, 8:32 AM IST

Updated : Dec 8, 2021, 11:29 AM IST

అక్కడ అల్లుళ్ల పేరున కాలనీ.. ఎందుకంటే?

Jamai Colony Faridabad: కాలనీలకు సాధారణంగా ప్రముఖుల పేర్లను వాడుతుంటారు. అందుకు కాస్త భిన్నమైన పేరుతో ఓ కాలనీ ఉంది. హరియాణాలోని ఫరీదాబాద్​​ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పేరు జమాయ్​ కాలనీ. స్థానికంగా జమాయ్ అంటే అల్లుడు అని అర్థం. అంటే ఈ ప్రాంతాన్ని అల్లుళ్ల కాలనీ అంటారన్నమాట. మరి అక్కడ అందరూ అల్లుళ్లు ఉంటారా? అని మీకు సందేహం రావచ్చు. అవును.. మీరు అనుకున్నది నిజమే. ఛాజ్​పుర్ గ్రామానికి చెందిన అల్లుళ్లలో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడిపోయారు. అలా ఈ కాలనీకి ఆ పేరు వచ్చి.. అల్లుళ్లకు కేరాఫ్​గా మారింది.

Jamai Colony Faridabad
జమాయ్​ కాలనీ

మాతా కాలనీ కాస్త అల్లుళ్ల కాలనీగా..

జమాయ్​ కాలనీ పేరు ప్రాచుర్యంలోకి రావడానికి ఛాజ్​పుర్​ గ్రామస్థులే కారణమంటున్నారు బలీందర్ అనే స్థానికుడు.

"ఎనిమిదేళ్ల క్రితం సమీపాన ఉండే ఛాజ్​పుర్​ గ్రామం నుంచి ఓ యువతి తన భర్తతో ఇక్కడికి వచ్చి స్థిరపడింది. ఇక్కడ చౌకగా స్థలం దొరకడమే అందుకు కారణం. ఆ తర్వాత క్రమంగా ఆ గ్రామానికి చెందిన యువతులను పెళ్లి చేసుకున్న వ్యక్తుల్లో చాలా మంది ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అలా మాతా కాలనీగా ఉండాల్సిన పేరు కాస్త జమాయ్​ కాలనీగా మారింది. ఇక్కడ సుమారు 100 ఇళ్లు ఉంటాయి."

-బలీందర్​, స్థానికుడు

ఈ ప్రాంతంలోనే స్థిరపడటానికి ఇది పారిశ్రామిక ప్రాంతం కావడం కూడా ఓ కారణం అంటున్నారు స్థానికులు. ఉద్యోగాల కోసం ఛాజ్​పుర్​ సహా సమీప గ్రామాల నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డట్లు వెల్లడించారు.

Jamai Colony Faridabad
జమాయ్​ కాలనీ ఫొటోలు

ఈ జమాయ్​ కాలనీ పేరు ఎంత పాపులర్​ అయిందంటే.. ప్రస్తుతం ఈ కాలనీని అసలు పేరుతో పిలిస్తే ఎవరూ గుర్తించలేనంత. కానీ అక్కడ నివసిస్తున్న వారికి మాత్రం ఈ జమాయ్​ కాలనీ పేరు నచ్చలేదు. అయినా మరో గత్యంతరం లేకపోవడం వల్ల వారు కూడా అడ్రెస్​ను జమాయ్​ కాలనీ అనే చెబుతున్నారు.

Jamai Colony Faridabad
జమాయ్​ కాలనీ, ఫరీదాబాద్​ జిల్లా

అయితే ఈ జమాయ్​ కాలనీకి అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోవడం గమనార్హం. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అంతంతమాత్రమే. కానీ ఉద్యోగాల కోసమని ఛాజ్​పుర్​ సహా సమీప గ్రామాలకు చెందిన అల్లుళ్లు ఇక్కడకు వలస వస్తున్నారు.

ఇదీ చూడండి : విడాకుల గురించి గొడవ- కోర్టులోనే బావపై కత్తితో దాడి

Last Updated : Dec 8, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.