ETV Bharat / bharat

'జామా మసీదులోకి మహిళలకు నో ఎంట్రీ' ఉత్తర్వులు ఉపసంహరణ

దిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులోకి మహిళల ప్రవేశంపై నిషేధం విషయంలో యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు రాగా.. నిషేధంపై ఉత్తర్వుల్ని జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఉపసంహరించుకున్నారు.

jama masjid entry ban for women
jama masjid entry ban for women
author img

By

Published : Nov 24, 2022, 7:12 PM IST

Updated : Nov 24, 2022, 7:33 PM IST

జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. మసీదు యాజమాన్యం వెనక్కు తగ్గింది. నిషేధం ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకుంది. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సూచించిన కాసేపటికే ఈమేరకు చర్యలు చేపట్టింది.

అంతకుముందు దిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులోకి.. మహిళ ప్రవేశాన్ని యాజమాన్యం నిషేధించింది . ఒంటరిగా లేదా బృందంగా వచ్చిన సరే అమ్మాయిలకు ప్రవేశంలేదని.. జామా మసీదు మూడు ప్రవేశ ద్వారాల వద్ద నోటీసులు అంటించింది. కాగా యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరణ ఇచ్చారు. మసీదులో ప్రార్థనలకు వచ్చేవారిపై.. ఎలాంటి ఆంక్షలులేవన్నారు. గురువారం కూడా 20 నుంచి 25 మంది అమ్మాయిలు వచ్చి.. ప్రార్థనలు చేసుకున్నట్లు చెప్పారు. కానీ కొందరు అమ్మాయిలు ఇక్కడకు ఒంటరిగా వచ్చి తమ ప్రియుల కోసం వేచిచూస్తున్నారని ఆయన ఆరోపించారు. మసీదులు, ఆలయాలు, గురుద్వారాల్లో అలాంటి చర్యలను అనుమతించరని బుఖారీ చెప్పారు. ప్రార్థనా మందిరాలు దైవాన్ని ఆరాధించడానికి మాత్రమేనని స్పష్టంచేశారు.

హెరిటేజ్ నిర్మాణమైన జామా మసీదులో కొన్ని ఘటనలు జరగడంతో మహిళలపై ప్రవేశంపై నిషేధం విధించామని చెప్పారు బుఖారీ. కానీ ప్రార్థనలు చేసేవారిపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఈ ఆంక్షలను.. దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్ ఖండించారు. మహిళల హక్కుల ఉల్లంఘనపై ఇమామ్‌కు నోటీసు ఇచ్చారు. ప్రార్థన చేసుకోవడానికి పురుషులకు ఎంత హక్కు ఉందో.. మహిళలకు కూడా అంతే హక్కు ఉందని అన్నారు. ఇలా మహిళలపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. గురువారం సాయంత్రం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కాసేపటికే నిషేధం ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నట్లు జామా మసీదు వర్గాలు ప్రకటించాయి.

ఇవీ చదవండి : '581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి'.. కోర్టులో పోలీసుల వింత వాదనలు!

ఇదేం తీర్పురా బాబు! రేప్ కేసు నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలా?

Last Updated : Nov 24, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.