ETV Bharat / bharat

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంలో భారత్​ ఎవరి పక్షం?.. మంత్రి జవాబు ఇదీ...

Indian stand on Ukraine war: రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంలో భారత్​ ఒక పక్షంవైపు నిలబడాల్సి వస్తే అది శాంతి పక్షమేనని నొక్కి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్​. హింసకు వెంటనే ముగింపు పలికేందుకే మద్దతు తెలుపుతామన్నారు. ఉక్రెయిన్​ సంక్షోభంపై లోక్​సభలో చర్చ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు మంత్రి.

author img

By

Published : Apr 6, 2022, 1:56 PM IST

Indian stand on Ukraine war: రష్యా-ఉక్రెయిన్​ సంక్షోభానికి భారత్​ వ్యతిరేకమని నొక్కిచెప్పారు విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. భారత్​ ఒక పక్షంవైపు నిలబడాల్సి వస్తే .. అది శాంతి, హింసకు వెంటనే ముగింపు పలికే పక్షమేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లోని పరిస్థితులుపై లోక్​సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్​. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందనే విషయాన్ని సభ్యులందరూ అంగీకరించాలని సూచించారు.

"మనం యుద్ధానికి వ్యతిరేకం. అమాయకుల ప్రాణాలు తీయటం, రక్తపాతంతో పరిష్కారం లభించదని మనం గట్టిగా నమ్ముతున్నాం. ప్రస్తుత రోజుల్లో ఏ సమస్యకైనా దౌత్యపరంగా చర్చించటమే సరైన సమాధానం. సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండేందుకు ఐక్యరాజ్య సమితిలో నిబంధనలు నిర్మితమైనట్లు ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. భారత్​ ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సి వస్తే.. అది శాంతి పక్షమే. అలాగే హింసకు వెంటనే ముగింపు పలికేందుకే. ఇదే మా సూత్రప్రాయ వైఖరి. ఐరాసతో పాటు అంతర్జాతీయ వేదికలు, చర్చల్లో మా వైఖరిని తెలియజేస్తూ వస్తున్నాం."

- ఎస్​ జైశంకర్​, విదేశాంగ శాఖ మంత్రి.

ఉక్రెయిన్​లోని బుచాలో అమాయకపు పౌరులను చపటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు జైశంకర్​. బుచాలో హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది తీవ్రమైన అంశమని.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న వాదనకు మద్దతు పలుకుతున్నామని తెలిపారు. ఉక్రెయిన్​ పరిస్థితికి సంబంధించి భారత చర్యలకు రాజకీయ రంగును ఆపాదించటం దురదృష్టకరమన్నారు మంత్రి.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​లో​ హత్యలను ఖండించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.