ETV Bharat / bharat

ఆ సమావేశానికి చైనా  నేతృత్వం- జైశంకర్​ గైర్హాజరు - భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​

చైనా నేతృత్వం వాహించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యున్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ హాజరుకాలేదు. ఆయన తరఫున విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ శ్రింగ్లా పాల్గొన్నారు.

Jaishankar
జైశంకర్​
author img

By

Published : May 8, 2021, 5:22 PM IST

చైనా అధ్యక్షతన వర్చవల్​గా జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యున్నత స్థాయి​ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ హాజరుకాలేదు. ఆయన తరఫున విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ శ్రింగ్లా పాల్గొన్నారు.

చైనా-భారత్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి జైశంకర్ దూరంగా ఉన్నారు. కాగా భద్రతా మండలి అత్యున్నత స్థాయి సమావేశానికి 14 దేశాలు మంత్రి స్థాయి అధికారులను పంపించాయి.

ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ ప్రధాన మంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ పాల్గొన్నారు. మరో 7 దేశాలు తమ విదేశాంగ మంత్రుల్ని పంపించాయి.

మరో ముగ్గురు సహాయమంత్రులు ఈ సమావేశానికి హజరయ్యారు. బ్రిటన్​ సహాయమంత్రి తారీఖ్​ అహ్మద్, ఫ్రాన్స్​ సహాయ మంత్రి జీన్​-బాప్టిస్ట్ లేమోయెన్, కెన్యా విదేశాంగ కార్యదర్శి రాయ్​చెల్లే ఓమామో ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అసోం సీఎం ఎవరు? ఉత్కంఠకు తెరపడేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.