ETV Bharat / bharat

పుల్వామా తరహా ఉగ్రదాడికి కుట్ర- నలుగురు అరెస్ట్

author img

By

Published : Mar 10, 2021, 5:54 PM IST

Updated : Mar 10, 2021, 6:09 PM IST

జమ్ముకశ్మీర్​లో జైషే మహ్మద్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా తరహాలో దాడి చేసేందుకు సిద్ధం చేస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Terror module busted
జమ్ముకశ్మీర్​లో జైషే మహమ్మద్​ టెర్రర్​ మాడ్యూల్​ను ఛేదించి పోలీసులు

పుల్వామా తరహాలో భద్రతా దళాలపై కారు బాంబుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ముకశ్మీర్​లో జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులను అరెస్ట్​ చేశారు. కశ్మీర్​లోని పాంపోర్ జిల్లాలో భద్రతా దళాలపై కారు బాంబు దాడులకు వీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. ​

" జైషే ఉగ్రసంస్థ కారు బాంబు దాడులు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అవంతిపొరా పోలీసులు ఈ కుట్రను ఛేదించారు. ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న నలుగురిని అరెస్ట్​ చేశాం. దాడుల కోసం ఉపయోగించేందుకు సిద్ధం చేసుకుంటున్న కారును స్వాధీనం చేసుకున్నాం."

- విజయ్​ కుమార్​, కశ్మీర్​ జోన్​ ఐజీ

మొబైల్​ యాప్​ల ద్వారా విద్యార్థికి వల

బీఏ తొలి ఏడాది చదువుతోన్న సాహిల్​ నాజిర్​ అనే విద్యార్థిని టెలిగ్రాం, ఇతర మొబైల్​​ యాప్​ల ద్వారా వలలో వేసుకున్నారు జైషే ఉగ్రవాదులు. దాడులు చేసేందుకు ఓ పాత కారును కొనుగోలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో సాంకేతిక, ఇతర నిఘా వ్యవస్థల ఆధారంగా సాహిల్​ను పట్టుకున్నట్లు చెప్పారు ఐజీ. కారు బాంబు దాడి పథకాన్ని పోలీసులకు అతడు వెల్లడించినట్లు తెలిపారు. ఈ కుట్రలో భాగమైన కైసర్​, యూనిస్​, యాసిర్​ అహ్మద్​ వానీని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 25న భద్రతా దళాలపై​ గ్రనేడ్​ దాడి చేసినట్లు సాహిల్​ ఒప్పకున్నాడని వివరించారు ఐజీ విజయ్.

లష్కరే ఉగ్రవాది అరెస్ట్​..

లష్కరే తోయిబా కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తోన్న ఓ సభ్యుడిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు ఐజీ కుమార్​. పాంపోర్​లోని అతని ఇంటి నుంచి 25 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

Last Updated : Mar 10, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.