ETV Bharat / bharat

బస్సుకు విద్యుత్​ తీగ తగిలి అన్నాదమ్ములు మృతి

author img

By

Published : Apr 5, 2022, 5:25 PM IST

Jaisalmer bus electric accident: రాజస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్​కు కరెంట్​ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు ఉత్తర్​ ప్రదేశ్​లో వ్యాన్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు.

jaisalmer bus electric accident
జైసల్మేర్​లో రోడ్డు ప్రమాదం

Jaisalmer bus electric accident: విద్యుత్ తీగ.. బస్సుకి తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన ​ జైసల్మేర్- చెలక్ రహదారిలోని గుహ్డో గ్రామం సమీపంలో మంగళవారం జరిగింది. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జోధ్​పూర్​ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ప్రమాదంలో రానారామ్ మేఘ్వాల్, నారాయణ్​రామ్​ మేఘ్వాల్ అనే సోదరులు మరణించారు. ​పధ్మారామ్ మేఘ్వాల్​ అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

వ్యాన్​ బోల్తా పడి ఒకరు ప్రాణాలను కోల్పోగా, 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని ఫిరోజాబాద్ సమీపంలోని హరిశ్చంద్ర గ్రామ పరిధిలో సోమవారం రాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రుల్లో 14 మంది చిన్నారులు ఉన్నారని.. అందర్నీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. వ్యాన్​లోని ప్రయాణికులు వైష్ణో దేవి ఆలయంలో పూజలు చేసేందుకు ఇక్కడికి వచ్చారని వివరించారు. మృతుడు సుశీల్‌(40)గా గుర్తించామని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విద్యార్థులపై ఉపాధ్యాయురాలి​ లైంగిక వేధింపులు.. కుమారుడిని కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.