ETV Bharat / bharat

'జై భీమ్ సినిమాకు అవార్డులు, ప్రశంసలు బంద్!' - jai bhim director

సూర్య నటించిన జై భీమ్ సినిమాకు ఎలాంటి అవార్డులు ఇవ్వకూడదని వన్నియార్ సంఘం (jai bhim vanniyar) డిమాండ్ చేసింది. ప్రశంసలకు గానీ, గుర్తింపులకు గానీ ఆ సినిమాను (jai bhim controversy) పరిగణలోకి తీసుకోకూడదని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ ఇచ్చింది.

JAI BHIM controversy
JAI BHIM controversy
author img

By

Published : Nov 19, 2021, 5:58 AM IST

తమిళ నటుడు సూర్య నటించిన జై భీమ్​ సినిమాను వివాదాలు (jai bhim controversy) చుట్టుముడుతూనే ఉన్నాయి. తమ సామాజిక వర్గాన్ని ప్రతికూలంగా చూపించారని ఆరోపణలు చేస్తున్న వన్నియార్ సంఘం (jai bhim vanniyar).. జై భీమ్ సినిమాకు ఎలాంటి అవార్డులు ఇవ్వకూడదని వ్యాఖ్యానించింది. ప్రశంసలు లేదా ఇతర గుర్తింపులు ఇచ్చేందుకు ఈ సినిమాను పరిగణలోకి తీసుకోవద్దని కేంద్ర సమాచార, ప్రసార శాఖ.. తమిళనాడు సమాచార, ప్రజా సంబంధాల శాఖను అభ్యర్థించింది.

ఈ సినిమా ఎలాంటి ప్రశంసలకు అర్హం కాదని వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పు థా అరుల్​మోజీ ఆరోపించారు. చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరెకిక్కించామని చెబుతున్నప్పటికీ.. పాత్రల పేర్లు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. సినిమాలోని కొన్ని సీన్లు ఐపీసీ 153, 153ఏ, 499, 503, 504, 505 సెక్షన్లను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు తన న్యాయవాది కే బాలు ద్వారా ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ పంపించారు.

ప్రతిష్ఠను మసకబార్చేలా..

సినిమాలో బలహీన వర్గానికి చెందిన రాజకన్నును హింసించిన పోలీస్​ అధికారి పాత్రను తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపారని వన్నియార్ సంఘం ఆరోపిస్తోంది. నిజ జీవితంలో జరిగిన ఘటనలో (jai bhim real story) పోలీస్ అధికారి పేరు ఆంథోనిసామి అని, అతను క్రైస్తవుడు చెబుతోంది. జై భీమ్ సినిమాలో మాత్రం సబ్​ ఇన్​స్పెక్టర్​ పాత్రను వన్నియార్ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపించారని అరుల్​మోజీ చెప్పారు. ఓ సీన్​లో క్యాలెండర్​లో తమ సంఘం గుర్తయిన (Vanniyar Sangam logo) అగ్ని కుంభాన్ని కూడా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.5 కోట్ల పరిహారం!

దీనిపై సినిమా నిర్మాణ సంస్థ, నిర్మాత, డైరెక్టర్​లకు (jai bhim director) లీగల్ నోటీసులు పంపించారు అరుల్​మోజీ. సినిమాను ప్రసారం చేసిన అమెజాన్ సంస్థపైనా సివిల్, క్రిమినల్ కేసులను పెట్టారు. సినిమాలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన సీన్లు, అగ్నికుందం చిహ్నాన్ని తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. సామాజిక వర్గానికి జరిగిన నష్టానికి ప్రతిగా.. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా రూ.5 కోట్ల పరిహారం సైతం చెల్లించాలని అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.