ETV Bharat / bharat

ఒక చేతిలో కుమారుడు, మరో చేత్తో రిక్షా సవారీ, భార్య ప్రేమ కారణంగా భర్తకు కష్టాలు - మధ్యప్రదేశ్​ వార్తలు

పొట్టకూటి కోసం తెలియని ప్రాంతానికి వచ్చాడు ఆ యువకుడు. అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఇటీవల అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఇక ఇద్దరి పిల్లల బాధ్యత అతడిపైనే పడింది. చేసేదేమీ లేక ఓ చేత్తో కుమారుడ్ని ఎత్తుకొని మరో చేత్తో రిక్షా నడుపుతున్నాడు. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగు చూసింది.

jabalpur-rikshaw-puller-father
jabalpur-rikshaw-puller-father
author img

By

Published : Aug 26, 2022, 1:56 PM IST

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ చేత్తో కుమారుడిని ఎత్తుకుని మరో చేత్తో రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువకుడు. అలా రిక్షా తొక్కడం ప్రమాదకరమైనా అతడికి తప్పట్లేదు. అసలేం జరిగిందంటే..
బిహార్​ నివాసి అయిన రాజేశ్​ మల్దార్​.. పొట్టకూటి కోసం జబల్​పుర్​కు పదేళ్ల క్రితం వచ్చాడు. స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో కన్హర్​వాడ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబంతో రోడ్డు పక్కన పుట్​పాత్​పైనే నివసిస్తున్నాడు రాజేశ్. అయితే కొన్నిరోజులు క్రితం.. అతడి​ భార్య పిల్లలిద్దరినీ విడిచిపెట్టి స్థానికంగా ఉంటున్న ఓ ట్రక్కు డ్రైవర్​తో వెళ్లిపోయింది.

jabalpur-rikshaw-puller-father-
చేత్తో కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న రాజేశ్

ఆ తర్వాత భార్య ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇక పిల్లలిద్దరి బాధ్యత రాజేశ్​పైనే పడింది. కుటుంబపోషణ చాలా కష్టంగా మారింది. ఇక చేసేదేమీ లేక రాజేశ్​.. ఓ చేత్తో కుమారుడ్ని ఎత్తుకొని మరో చేత్తో రిక్షా నడుపుతున్నాడు. అలా పిల్లాడ్ని ఎత్తుకునే రోజంతా రిక్షా తొక్కుతున్నాడు. పెద్ద బిడ్డను ఫుట్​పాత్​పైనే యువకుడి తల్లి చూసుకుంటోంది. పేదరికంలో మగ్గుతున్న తనకు ఎటువంటి ప్రభుత్వ పథకాలను అందడం లేదని వాపోతున్నాడు. రాజేశ్​ దుస్థితి చూసి అందరూ చాలా చలించిపోతున్నారు.

jabalpur-rikshaw-puller-father
రాజేశ్​తో మాట్లాడుతున్న చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ అధికారులు

అయితే రాజేశ్​ రిక్షా తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయింది. ఈ క్రమంలో ఆ వీడియో చైల్డ్​ వెల్ఫేర్ కమిటీ దృష్టికి వెళ్లింది. పిల్లాడ్ని ఎత్తుకొని ప్రమాదకరంగా రిక్షా నడపొద్దని మల్దార్​ను మందలించారు చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ అధికారులు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: ప్రేమను నిరాకరించారని మనస్తాపం, వివాహిత ఆత్మహత్య

భార్యపై ప్రేమతో ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిన భర్త, కానీ చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.