ETV Bharat / bharat

భార్యకు ప్రేమతో 'సూపర్ స్కూటర్​' రూపొందించిన మెకానిక్ - మధ్యప్రదేశ్​ న్యూస్​

​Mechanic Make A Super Scooter: వీడియోలు చూడడానికి వీలుగా హెచ్​డీ స్ర్కీన్​, పాటల కోసం మ్యూజిక్ సిస్టమ్​, వాహనం ముందు వెనుక కెమెరాలు, రంగు రంగుల లైట్స్​ ఇవన్నీ వింటుంటే ఇదేదో కొత్త కారులో ఉన్న సదుపాయాలు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేశారు ఇవన్నీ ఓ పాత స్కూటర్​కు ఉన్న సదుపాయాలు. ఇదేంటి పాత స్కూటర్​కు ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ సూపర్​ స్కూటర్​ కథ తెలుసుకోండి!

Jabalpur news
Jabalpur news
author img

By

Published : May 2, 2022, 10:29 PM IST

భార్యకు ప్రేమతో.. పాత స్కూటర్​ను సూపర్ స్కూటర్​గా మార్చిన మెకానిక్​​

Mechanic Make A Super Scooter: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​కు చెందిన మహ్మద్​ అక్రమ్​ గత 50 ఏళ్లుగా స్కూటర్​ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. కానీ అతడి వద్ద చెడిపోయిన పాత స్కూటర్​ ఉండేంది. దీనిపై ప్రయాణించాలంటేనే కష్టంగా ఉండేంది. దీంతో ఆగ్రహించిన అక్రమ్​ భార్య.. ఈ చెడిపోయిన స్కూటర్​పై కూర్చొనని శపథం చేసింది. ఆమె మాటలు విన్న అక్రమ్​.. స్కూటర్​కు కొత్త రూపాన్ని ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించాడు. అనుకున్నదే ఆలస్యం పాత స్కూటర్​ను మార్చే పనిలో నిమగ్నమయ్యాడు.

ఈ స్కూటర్​లో అనేక ప్రత్యేకతలతో రూపొందించాడు మెకానిక్​ మహ్మద్​ అక్రమ్​. స్కూటర్​కు స్వయంగా పెయింట్​ వేసి హెచ్​డీ స్ర్కీన్​ను అమర్చాడు. స్కూటర్​కు కెమెరాలు, మ్యూజిక్​ సిస్టమ్​తో పాటు పూర్తిగా లైట్లతో అందంగా తయారు చేశాడు. కొన్ని నెలల క్రితం అక్రమ్​కు గుండెపోటు వచ్చి అతడి పరిస్థితి విషమంగా మారింది. కోలుకున్న వెంటనే అక్రమ్​ తిరిగి స్కూటర్​ను రూపొందించడం ప్రారంభించాడు. ఎంతో ఆకర్షణీయంగా తయారైన ఈ వాహనాన్ని 'సూపర్​ స్కూటర్​'గా పిలుస్తున్నారు.

పాత స్కూటర్​పై రావడానికి నా భార్యకు ఇబ్బందిగా ఉండేది. స్కూటర్​పై ప్రయాణించనని కోపం తెచ్చుకుంది. దీంతో స్కూటర్​ను మార్చాలనే ఆలోచన వచ్చింది. గత 50 ఏళ్లుగా స్కూటర్​ మెకానిక్​గా పనిచేస్తున్నాను. దీంతో కారు మాదిరిగా స్ర్కీన్​, మ్యూజిక్​ సిస్టమ్​ అన్నీ అమర్చాను. ప్రస్తుతం లీటర్​కు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. జైపుర్,​ అజ్మీర్​ వెళ్లివచ్చాను. ఈ స్కూటర్​ను తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది. పెట్రోల్​ ధరలు పెరగడం వల్ల బ్యాటరీ అమర్చాలని అనుకుంటున్నాను. చాలా మంది విక్రయించాలని అడిగారు కానీ అమ్మలేదు. ఇప్పుడు స్కూటర్​తో నా భార్య చాలా సంతోషంగా ఉంది.

- మహ్మద్​ అక్రమ్​, స్కూటర్​ మెకానిక్​​

ఈ స్కూటర్​తో ఫొటోలు దిగేందుకు చుట్టుపక్కల ప్రజల ఆసక్తి చూపుతున్నారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ. 80 వేల వరకు ఖర్చు అయ్యిందని అక్రమ్​ తెలిపాడు. ప్రస్తుతం ఈ స్కూటర్​ సగటున లీటర్​కు 50 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందన్నాడు. పెట్రోల్​ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో స్కూటర్​కు ఎలక్ట్రిక్​ బ్యాటరీని అమర్చనున్నట్లు అక్రమ్​ తెలిపాడు.

అక్రమ్​ రూపొందించిన ఈ స్కూటర్​ను కొనుగోలు చేయడానికి అనేక మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది పెళ్లి కొడుకులను ఊరేంగించడానికి ఇవ్వాలని కోరారు. మూడు లక్షలు ఇస్తామన్నా.. ఈ స్కూటర్​ను విక్రయించడంలేదని స్థానికులు అంటున్నారు. తన భార్య కోరిక మేరకే స్కూటర్​ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దానని.. దీంతో ఆమె ఎంతో సంతోషంగా ఉందన్నాడు అక్రమ్​.

ఇదీ చదవండి: 'నా అరెస్ట్​ కోసం ప్రధాని కార్యాలయం కుట్ర.. 56 అంగుళాల పిరికితనం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.