ETV Bharat / bharat

ఆక్సిజన్​ ప్లాంట్​లకు సాయుధ బలగాల రక్షణ - సిలిండర్​ ప్లాంట్​ల వద్ద సాయుధ బలగాల మోహరింపు

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా మెడికల్​ ఆక్సిజన్​కు అధిక డిమాండ్​ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్​ సిలిండర్లు లూటీ కాకుండా మధ్యప్రదేశ్​లోని ఓ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిలిండర్​ ప్లాంట్​ల వద్ద ఏకంగా సాయుధ బలగాలను మోహరించింది.

Oxygen
ఆక్సిజన్​ సిలిండర్లు
author img

By

Published : Apr 21, 2021, 5:28 AM IST

దేశంలో కొవిడ్​ విజృంభిస్తున్న వేళ.. ప్రాణవాయువుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఆక్సిజన్​ కొరత ఏర్పడిన నేపథ్యంలో.. స్థానిక యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్లాంట్​ల వద్ద 24 గంటలపాటు కాపలా ఉండేలా సాయుధ బలగాలను మోహరించింది. సిలిండర్లను అక్రమంగా దోచుకోవడం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది అక్కడి యంత్రాంగం.

జబల్​పుర్​లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో.. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో ప్రాణవాయువుకు అధిక డిమాండ్​ ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ఆక్సిజన్ సరఫరాపై జిల్లా మేజిస్ట్రేట్​ ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'దిల్లీలో ఆక్సిజన్ కొరత.. కొన్ని గంటల్లో ఖాళీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.