ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత- ఇద్దరు ముష్కరులు హతం! - బందిపొరాలో ఉగ్ర అనుచరుల అరెస్టు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రఏరివేత కొనసాగుతోంది. బందిపొరాలో ఓ పౌరుడి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. బందిపొరా, అనంత్​నాగ్​ జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్లలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు.. రాజౌరీ సెక్టార్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్​ అధికారితో పాటు నలుగురు సైనికులు వీరమరణం పొందారు.

కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత
jammu kashmir encounter
author img

By

Published : Oct 11, 2021, 8:01 AM IST

Updated : Oct 11, 2021, 12:47 PM IST

జమ్ముకశ్మీర్​లో సాధారణ పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో.. పోలీసులు ఉగ్ర ఏరివేత చర్యలు చేపట్టారు. బందిపొరాలో లష్కర్ ఏ తోయిబా(ఎల్​ఈటీ) ఉగ్ర స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నైద్​ఖాయ్​కు చెందిన మహమ్మద్ షఫీ లోనే అలియాస్​ సోను అనే వ్యక్తి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.

బందిపొరా పోలీసులతో కూడిన ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. సిబ్బంది, సాంకేతికత సాయంతో ఎల్​ఈటీకి చెందిన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేసింది. వీరిని తారిఖ్ అహ్మద్ దార్​, మహమ్మద్ షఫీ దార్​, ముదాసిర్ హసన్​లోనే, బిలాల్ అహ్ దార్​గా పోలీసులు గుర్తించారు.

మహమ్మద్ షఫీ లోనే హత్యలో కీలక పాత్ర పోషించిన ఇంతియాజ్​ ఆహ్ దార్ అనే ఉగ్ర అనచరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడు ఉగ్రమూకలతో కలిసి పోయినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో.. పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాది లాలా ఉమర్​ ఆదేశాలతోనే ఈ హత్య జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

అనంత్​నాగ్​లో..

మరోవైపు.. జమ్ముకశ్మీర్​లో​ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్​నాగ్ జిల్లా ఖాగుండ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాదిని భద్రతా బలగాలు సోమవారం మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్​లో తెలిపారు.

బందిపొరాలో..

బందిపొరా హాజిన్​లో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాది.. హతమయ్యాడు. భద్రతా సిబ్బందికి, ముష్కరులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముష్కరుడు హతమయ్యారు.

రాజౌరీలో సైనికుల వీరమరణం..

పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిలోని రౌజరీ సెక్టార్​లో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జూనియర్ కమిషన్​ అధికారితో పాటు నలుగురు సైనికులు వీరమరణం పొందారు.

ఇదీ చూడండి: 'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'

Last Updated : Oct 11, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.