ETV Bharat / bharat

నేడు కశ్మీర్​లో​ తొలి దఫా స్థానిక సమరం - డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్ ఎన్నికలు

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం మొదటి సారి జరుగుతోన్న స్థానిక సమరంలో భాగంగా నేడు తొలి దశ పోలింగ్​ జరగనుంది. మొత్తం 43 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(డీడీసీ)లు, 94 నియోజకవర్గాల్లో సర్పంచ్​, 368 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్​ చేపట్టనున్నారు.

DDC Ph-1 polls
నేడు కశ్మీర్​లో​ తొలిదశ స్థానిక సమరం
author img

By

Published : Nov 28, 2020, 5:50 AM IST

జమ్ముకశ్మీర్​కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం తొలిసారిగా అక్కడ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలోని 73వ సవరణను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. అందులో భాగంగా నిర్వహించనున్న 8 దశల ఎన్నికల్లో.. శనివారం (నవంబర్​ 28)న తొలి దశలో 43 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(డీడీసీ)లు, సర్పంచ్​ స్థానాలకు పోలింగ్​ జరగనుంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో డీడీసీ, సర్పంచ్​, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.

తొలి దశలో మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్​ జరుగుతోంది. వీటిలో 25 కశ్మీర్​లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి. డీడీసీ ఎన్నికల్లో మొత్తం 296 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 207 మంది పురుషులు, 89 మంది మహిళలు ఉన్నారు. 94 నియోజకవర్గాల్లో సర్పంచ్​ ఎన్నికలు జరగనుండగా.. 279 మంది బరిలో ఉన్నారు. అలాగే.. 368 నియోజకవర్గాల్లో జరుగుతోన్న సర్పంచ్​ ఉప ఎన్నికల్లో 852 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మొత్తం 2,146 పోలింగ్​ కేంద్రాల్లో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ 7,03,620 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో కశ్మీర్​ డివిజన్​లో 3.72 లక్షలు, జమ్ము డివిజన్​లో 3.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ముష్కర ముప్పు..

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

మొత్తం 280 స్థానాలు

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇదీ చూడండి:కశ్మీర్​లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.