ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​పై కేంద్రం దాడి'​ - రాష్ట్ర హోదా పునరుద్ధరణ

అసెంబ్లీ ఎన్నికలకు ముందే జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. దిల్లీ నుంచి జమ్ముకశ్మీర్ నేరుగా దాడికి గురవుతోందని ఆరోపించారు. తమ కుటుంబం కశ్మీర్​లోనే ఉండేదని, ప్రస్తుతం తన సొంత ఇంటికి వచ్చినట్లుగానే ఉందన్నారు రాహుల్​. శ్రీనగర్​లో పార్టీ నూతన కార్యాలయన్ని ప్రారంభించారు.

Rahul Gandhi at Srinagar
రాహుల్​ గాంధీ, కశ్మీర్​ పర్యటన
author img

By

Published : Aug 10, 2021, 4:20 PM IST

దిల్లీ నుంచి జమ్ముకశ్మీర్​పై దాడి జరుగుతోందని అన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. అప్పుడే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు.

రెండు రోజుల కశ్మీర్​ పర్యటనలో భాగంగా ముందుగా గందెర్బాల్​లోని కశ్మీరీ పండిత్​ల ఆరాధ్య దైవం మాతా ఖీర్​ భవానీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు రాహుల్​ గాంధీ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం శ్రీనగర్​లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. కార్యకర్తలు, మద్దతుదారులతో మాట్లాడారు.

" భారత్​ను విభజిస్తున్నందుకే ప్రధాని మోదీ, ఆయన విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. విజయం సాధించేవరకు నా పోరాటం కొనసాగుతుంది. ప్రస్తుతం కేంద్రం జమ్ముకశ్మీర్​పైనే దాడి చేయటం లేదు. తమిళనాడు, బంగాల్​ సహా ఇతర రాష్ట్రాలపైనా దాడికి పాల్పడుతోంది. అయితే.. ఇతర రాష్ట్రాలు పరోక్షంగా ప్రభావితమైతే.. జమ్ముకశ్మీర్​ నేరుగా దిల్లీ నుంచి దాడికి గురవుతోంది. జమ్ముకశ్మీర్​పై కాంగ్రెస్​ వైఖరి స్పష్టంగా ఉంది. రాష్ట్ర హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి, అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి.

నేను కశ్మీర్​​ ప్రజలతోనే ఉన్నా. ప్రేమ, గౌరవంతో మీతో సంబంధం ఏర్పరుచుకోవాలనుకుంటున్నా. కరోనా సమయంలో ఇక్కడకు రావాలనుకున్నా. కానీ, నన్ను అనుమతించలేదు. ఈ రోజు మా కుటుంబం దిల్లీలో నివసిస్తోంది. కానీ, అంతకుముందు కశ్మీర్​లోనే ఉన్నారు. మా కుటుంబం సైతం జీలమ్​ నది నీటిని తాగింది. నాలో కూడా కశ్మీరీ లక్షణాలు ఉన్నాయి. ఇక్కడకు వస్తే.. సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. త్వరలోనే జమ్ము, లద్దాఖ్​కు వెళ్తాను. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్​ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ కోరారు. ఆయన​ డిమాండ్​పై స్పందిస్తూ.. 'పార్లమెంట్​లో చాలా విషయాలపై మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. రఫేల్​, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై మాట్లాడలేకపోతున్నా. న్యాయవ్యవస్థ, లోక్​సభ సహా మీడియా నోరును భాజపా నొక్కుతోంది.' అని మండిపడ్డారు రాహుల్.

అంతకుముందు కశ్మీర్​లోని ప్రముఖ హజ్రత్​బల్​ మసీదును సందర్శించారు రాహుల్​ గాంధీ. దేశం సుఖశాంతులతో సుసంపన్నగా వర్ధిల్లాలని కోరుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'ప్రతి భారతీయుడి ఫోన్​ను మోదీ ట్యాప్​ చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.