ETV Bharat / bharat

ఉగ్ర కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక ఏజెన్సీ

తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్​ఐఏ) ఏర్పాటుకు ఆదేశించింది జమ్ముకశ్మీర్​ యంత్రాంగం. ఎస్​ఐఏకు సీఐడీ విభాగ అధిపతి ఎక్స్​-అఫీషియో డైరెక్టర్​గా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొంది.

్
జమ్ము కశ్మీర్​
author img

By

Published : Nov 2, 2021, 11:00 AM IST

ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు జమ్ముకశ్మీర్​ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్​ఐఏ) ఏర్పాటుకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎస్​ఐఏ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు.. ఎస్​ఐఏ నోడల్​ ఏజెన్సీగా వ్యవహరించనుందని ప్రకటనలో పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం.. ఇకపై ఉగ్రవాద సంబంధిత కేసులను పోలీసులు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని ఎస్​ఐఏకు అందించాల్సి ఉంటుంది.

ఎన్​ఐఏ ఈ కేసుల దర్యాప్తును చేపట్టకపోతే.. ఆ కేసును విచారణపై జమ్ముకశ్మీర్​ పోలీస్​ యంత్రాంగం, ఎస్​ఐఏ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. కేసు ఎవరికి అప్పగించాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం డీజిపీకే ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్​ఐఏకు కేసు బదిలీ కాని పక్షంలో ఆ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఎస్​ఐఏకు అందిస్తూ ఉండాలని తెలిపింది. అవసరమైతే ఎస్​ఐఏ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టవచ్చని వెల్లడించింది.

ఈ ఏజెన్సీకి సీఐడీ విభాగ అధిపతి ఎక్స్​-అఫీషియో డైరెక్టర్​గా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొంది.

25 శాతం పెంపు..

మరోవైపు, శాంతి భద్రతలకు కృషి చేస్తున్న పోలీస్​ అధికారులకు స్పెషల్ సెక్యూరిటీ అలోవెన్స్​ను ప్రకటించింది కశ్మీర్ యంత్రాంగం. దీంతో పాటు ఆపరేషనల్​ స్టాఫ్​కు వేతనాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఆపరేషనల్​ స్టాఫ్​కు.. జీతంపై 25 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి : 'మాజీ సీఎం భార్యతో డ్రగ్స్‌ వ్యాపారి ఫొటోలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.