ETV Bharat / bharat

ఆ గార్డెన్​లో మొక్కలకు పూలకు బదులు గుడ్లు! - kerala tourism

కేరళలో ఓ ఉద్యానవనంలోని మొక్కలకు గుడ్లు పూస్తున్నాయి. మొక్కలకు పూలు కాకుండా గుడ్లు పూయడమేంటి అనుకుంటున్నారా? ఓ ఔత్సాహికుడి ప్రయత్నంతో ఈ వింత సాధ్యమైంది. ఆ విశేషాలెంటో ఇప్పుడూ చూద్దాం.

eggshell garden
గుడ్డు తోట
author img

By

Published : Apr 18, 2021, 6:57 AM IST

చూపరులను ఆకట్టుకుంటున్న షైన్​ మొక్కలపై ఉన్న గుడ్డు పెంకులు..

‍కేరళలోని కుమలి-మున్నార్‌ రాష్ట్ర రహదారికి ఇరువైపుల దాదాపు అరకిలోమీటర్‌ దూరం షెల్‌ గార్డెన్ నిర్మించారు శిబు అనే ఔత్సాహికుడు. ఎడారి జాతికి చెందిన పైన్‌ మొక్కల ఆకులపై గుడ్డు పెంకును అమర్చి అందంగా తీర్చి దిద్దారు. దూరం నుంచి చూస్తే అందమైన పూలు పూసినట్లే తెల్లగా ఆకర్షణీయంగా మొక్కలు కనువిందు చేస్తున్నాయి. తెల్లగా ప్రకాశిస్తున్న ఈ ఉద్యానవనం వద్ద ఫొటోలు దిగేందుకు వాహన చోదకులు ఆసక్తి చూపిస్తున్నారు.

10 ఏళ్ల క్రితం ఇంటి పెరటిలో గుడ్డు పెంకుల ఉద్యానవనాన్ని.. శిబు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఉద్యానవనాన్నే రహదారి వెంట కూడా పెంచాలని నిర్ణయించారు. అలా పెంచిన ఎగ్‌ షెల్‌ ఉద్యానవనం ఇప్పుడూ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇదీ చదవండి: 'మా పెళ్లికి రండి- కరోనా నెగెటివ్​ రిపోర్ట్ తప్పనిసరి!'

రోజు హోటళ్లు, బెకరీల వద్ద వాడి పడేసిన గుడ్డు పెంకులను శిబు పొగు చేస్తారు. అనంతరం వాటిని తన భార్య, కుమారుడి సాయంతో పైన్‌ మొక్కల ఆకుల కొనలకు అమర్చుతారు. రోజుకు కనీసం దాదాపు వెయ్యి వరకు ఖాళీ గుడ్డు పెంకులను సేకరిస్తున్నట్లు శిబు తెలిపారు. మొక్కలకు పెట్టిన గుడ్డు పెంకుల రంగు రెండు వారాల కంటే ఎక్కువ ఉండదని వివరించారు. అందుకే ఎప్పటికప్పుడు పాలిపోయిన పెంకులను తొలగించి కొత్తవి అమర్చుతున్నట్లు పేర్కొన్నారు.

శిబు చేస్తున్న ప్రయత్నం రహదారి పక్కన ఆహ్లాదాన్ని పంచడంతో పాటు స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఇదీ చదవండి: గుల్మార్గ్​లో హిమపాతం- పర్యటకులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.