ETV Bharat / bharat

సహోద్యోగులపై ఆర్మీ జవాన్ కాల్పులు.. ఆపై తనను తాను కాల్చుకొని.. - itbp jawan fired on colleagues

ముగ్గురు సహోద్యోగులపై సర్వీస్​ పిస్టల్​తో కాల్పులు జరిపాడు ఓ జవాను. ఆపై తాను అదే గన్​తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని ఉధంపుర్​ జిల్లాలో జరిగింది.

ITBP jawan fired at his comrades, one killed, three injured.

author img

By

Published : Jul 16, 2022, 7:30 PM IST

ITBP Jawan Died: జమ్ముకశ్మీర్​లోని ఉధంపుర్​ జిల్లాలో ఓ ఐటీబీపీ జవాన్​.. తన ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. జిల్లాలోని దేవిక ఘాట్​ కమ్యూనిటీ సెంటర్​ వద్ద శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జవాన్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వారికి చికిత్స...
మృతి చెందిన జవాన్​ను.. భూపేంద్ర సింగ్​గా అధికారులు గుర్తించారు. అతడు కాల్పులు జరిపిన ఇద్దరు జవాన్లను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. భూపేంద్ర సింగ్​ 8వ బెటాలియన్​కు చెందినవాడని వివరించారు. ప్రస్తుతం అతడు జమ్ముకశ్మీర్​లోని తాత్కాలిక బెటాలియన్​లో విధులు నిర్వర్తిస్తున్నాడని చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.

ఇవీ చదవండి: అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ.. వాటిపై చర్చించాలని కాంగ్రెస్​ డిమాండ్​

'జైళ్లలో 80శాతం మంది వారే.. దానిపై దృష్టిపెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.