ETV Bharat / bharat

హిందూ సంప్రదాయంలో ఇటాలియన్​ జంట పెళ్లి.. తాజ్​మహల్​ వేదికగా.. - హిందూ సంప్రదాయంతో విదేశీయున పెళ్లి

ఇటలీకి చెందిన ఓ​ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి తాజ్​మహల్​ సమీపంలోని ఓ రిసార్ట్ వేదికైంది.

Italian couple
ఇటాలియన్​ జంట పెళ్లి
author img

By

Published : Dec 6, 2022, 11:02 PM IST

ఇటలీకి చెందిన ఓ జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైంది. తాజ్​మహల్​ ప్రేమకు చిహ్నం అనే నమ్మకంతో, తమ 40వ వివాహవార్షికోత్సం సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​.. ఆగ్రాలోని తాజ్​మహల్ సమీపంలోని ఓ రిసార్ట్​లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు మౌరో, స్టెఫానియా దంపతులు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహాన్ని స్థానికులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. 'భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాన్ని మరిచిపోతున్నా.. విదేశీయులు మాత్రం మన సంప్రదాయాలు పాటిస్తున్నారు' అని ఇటాలియన్ దంపతులకు పెళ్లి చేసిన పురోహితుడు ప్రవీణ్ దత్ అభిప్రాయపడ్డారు.

Italian couple
ఒక్కటైన ఇటాలియన్​ జంట

ఇటలీ నుంచి వచ్చిన మౌరో, స్టెఫానియా దంపతులు.. తమ 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం తాజ్​మహల్​​ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని భావించారు. దీని కోసం వారు ట్రావెల్ ఏజెంట్​ మనీశ్​ శర్మను సంప్రదించారు. దీంతో తాజ్ మహల్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఆ ఏజెంట్​ వివాహానికి ఏర్పాటు చేశాడు. అనంతరం మౌరో, స్టెఫానియా సంప్రదాయ దుస్తుల్లో తాజ్​మహాల్​ను సందర్శించారు. వివాహం అనంతరం కొత్త జంట అందరితో కలిసి డ్యాన్సులు వేశారు. అయితే 5 ఏళ్లుగా ఇలా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నామని.. ఇప్పుడు ఈ కల నెరవేరిందని ఇటాలియన్​ జంట వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.