ETV Bharat / bharat

చైనా మొబైల్ కంపెనీలపై ఐటీ దాడులు- దేశవ్యాప్తంగా.. - ఐటీ సోదాలు

IT Raid on Oppo: పన్ను ఎగవేతకు సంబంధించి దేశంలో చైనాకు చెందిన మొబైల్​, ఫిన్​టెక్​ కంపెనీల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. ఒప్పో, షావోమీ, వన్​ప్లస్​ తదితర కంపెనీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

IT Raid on Oppo
ఐటీ సోదాలు
author img

By

Published : Dec 22, 2021, 5:30 PM IST

Updated : Dec 22, 2021, 6:19 PM IST

IT Raids on Chinese Companies: దేశంలో చైనా ఆధారిత మొబైల్ ఫోన్​ కంపెనీల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఒప్పో, షావోమీ, వన్​ప్లస్, ఫిన్‌టెక్‌​ తదితర కంపెనీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ, నోయిడా, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, గువాహటి, ఇందోర్ సహా పలు నగరాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

భారత్​లోని చైనా కంపెనీలు భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిపింది ఐటీ శాఖ. ఆయా కంపెనీల సీఈఓలను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గత ఆగస్టులో చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న టెలికాం దిగ్గజం జెడ్​టీఈపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. సంస్థకు చెందిన ఐదు యూనిట్లు, ఫారెన్ డైరెక్టర్ నివాసం, కంపెనీ సెక్రటరీల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది. ఈ క్రమంలో సంస్థ 30 శాతం లాభాల్లో ఉన్నప్పటికీ భారీ నష్టాల్లో ఉన్నట్లు పత్రాల్లో చూపించారని ఐటీ అధికారులు గుర్తించారు.

Actor Vijay IT Raids: పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ స్టార్​ హీరో విజయ్​ దగ్గరి బంధువు జేవియర్​ బ్రిటో నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై అడయార్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు చేశారు. రెండు రోజులుగా ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

చైనాకు చెందిన షావోమీ కంపెనీ విడిభాగాల ఎగుమతులు, దిగుమతులను బ్రిటో కంపెనీ నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా చేసుకొని కంపెనీకి చెందిన 25 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బ్రిటో నివాసంలోనూ సోదాలు జరిపినట్లు వివరించారు.

చైనా యాప్స్​పై నిషేధం:

గల్వాన్‌ లోయలో.. భారత్‌- చైనా బలగాల మధ్య ఘర్షణల అనంతరం 106 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్రం. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కసరత్తు చేసింది. పబ్‌ జీ సహా.. సుమారు 280 యాప్‌లపై ఇప్పటికే నిఘా పెట్టిన కేంద్రం.. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లను దాదాపుగా నిషేధించింది. చైనా యాప్స్​ను నిషేధిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో అమెరికా, ఫ్రాన్స్​ కూడా స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత సమగ్రత, దేశ జాతీయ భద్రతను పెంపొందిస్తుందని అగ్రరాజ్యం అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో.. ఇప్పుడు చైనాకు చెందిన మొబైల్​, ఫిన్​టెక్​ కంపెనీల్లో ఐటీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

ఉగాండా నుంచి వచ్చిన ఆమె బ్యాగ్​లో రూ.14కోట్ల హెరాయిన్​

టాటూ కోసం వచ్చి 'హనీ ట్రాప్'- రూ.20లక్షలు డిమాండ్​

Last Updated : Dec 22, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.