ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ.. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే బహిరంగ సభ వేదికగా భాజపాలో చేరతారంటూ వస్తున్న వార్తపై పెద్ద చర్చే నడుస్తోంది. మరి భాజపాలో గంగూలీ చేరుతున్నారా?

Ganguly
బంగాల్​ దంగల్​: మోదీ సమక్షంలో భాజపాలోకి గంగూలీ!
author img

By

Published : Mar 3, 2021, 11:01 AM IST

'త్వరలోనే భాజపాలోకి గంగూలీ'..

'దీదీని దించేందుకు రంగంలోకి దాదా'..

ఇవి.. చాలా కాలంగా వినిపిస్తోన్న వార్తలే.. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా?

'గంగూలీ.. బంగాల్​ బ్రిగేడ్​ మైదానంలో ఈ నెల 7న జరగనున్న మోదీ బహిరంగ సభలో భాజపాలో చేరనున్నారు'. ఇది ప్రస్తుతం హాట్​ టాపిక్.

అయితే బంగాల్​ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భాజపాలో సౌరవ్ గంగూలీ చేరికపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, టీఎంసీ ఎమ్మల్యేల చేరికతో జోష్​ మీద ఉన్న కమలనాథులు.. దాదా చేరితే విజయం తథ్యమని భావిస్తున్నారట. మరి గంగూలీ చేరికపై వార్తల్లో నిజమెంత?

మోదీ బహిరంగ సభ..

మార్చి 7న బంగాల్​లోని బ్రిగేడ్​ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై భాజపా కూడా స్పందించింది.

"గంగూలీ.. ఆ రోజు సభకు హాజరవుతారా లేదా? అనేది ఆయన వ్యక్తిగతం. ప్రస్తుతం గంగూలీ.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిస్థితులు, ఆరోగ్యం సహకరించి ఆయన వస్తానంటే సాదరంగా స్వాగతిస్తాం. గంగూలీ వస్తే.. అది ఆయనకు నచ్చుతుంది. హాజరైన జనాలకు నచ్చుతుంది. అయితే రావడం, రాకపోవడం ఆయన ఇష్టం."

- షామిక్​ భట్టాచార్య, భాజపా ప్రతినిధి

"గంగూలీ.. ఈ నెల 7న మోదీ సమావేశానికి హాజరవుతారనే విషయంపై నాకు సమాచారం లేదు. అలాగే ఈ విషయంపై పార్టీలోనూ చర్చ జరగ లేదు."

- దిలీప్​ ఘోష్​, బంగాల్​ భాజపా అధ్యక్షుడు

ఈ విషయంపై గంగూలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవలే గంగూలీ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఈ మాజీ క్రికెటర్​ను మూడు రోజుల చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

ఎప్పటి నుంచో..

2019లో గంగూలీ.. అమిత్​షాతో సమావేశం కావడంపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం గంగూలీని పార్టీలోకి అమిత్​ షా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పుడే గంగూలీ ఖండించారు. ప్రస్తుతం అమిత్​ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సోదరుడు అరుణ్​ ధుమాల్​ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.