ETV Bharat / bharat

'దేశానికి భాజపా ప్రాముఖ్యత ఇవ్వడం గొప్పవిషయం' - సీబీఎస్​ఈ పరీక్షలు వాయిదా

సీబీఎస్​ఈ పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. కాంగ్రెస్​ సహా, ఇతర ప్రతిపక్షాలు మోదీని ప్రశంసించాయి. భాజపా దేశానికి ప్రాముఖ్యత ఇవ్వడం గొప్పవిషయమని ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు.

BJP
భాజపా
author img

By

Published : Apr 14, 2021, 10:42 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి బుధవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు స్పందించాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మోదీజీ మంచి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్టు పెట్టింది.

"వెల్డన్‌ మోదీజీ! దేశాన్ని తీర్చిదిద్దడంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా దూరం ప్రయాణిస్తారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడం మన ప్రజాస్వామ్యం కర్తవ్యం. భాజపా దేశానికి ప్రాముఖ్యత ఇవ్వడం గొప్పవిషయం"

-కాంగ్రెస్

"ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు సంతోషం. 12వ తరగతి పరీక్షలపై కూడా తుది నిర్ణయం తీసుకోవాలి. జూన్‌ వరకు విద్యార్థులను అనవసరమైన ఒత్తిడికి గురి చేయడం సరికాదు. వాటిపై కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను"

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

అలాగే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

"సీబీఎస్‌సీ పరీక్షలపై కేంద్రం నిర్ణయం సంతోషాన్నిచ్చింది. ఇది లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు గొప్ప ఊరట"

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

కరోనా విజృంభణ నేపథ్యంలో వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని చర్చలు జరిపారు. అనంతరం పోఖ్రియాల్ ట్విటర్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. సీబీఎస్‌సీ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలిపారు. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: 'దేశాల మధ్య సహకారంతో ప్రచ్ఛన్న యుద్దానికి ముగింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.