ETV Bharat / bharat

'మీడియా'పై ఐటీ దాడులు- రాజకీయంగా దుమారం - ఐటీ సోదాలు

మీడియా సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై రాజ్యసభలోనూ ఆందోళన చేపట్టాయి విపక్షాలు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నమేనని విమర్శించాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టింది కేంద్రం. దాడుల్లో ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేసింది.

IT dept raids Dainik Bhaskar
దైనిక్​ భాస్కర్​పై ఐటీ సోదాలు
author img

By

Published : Jul 22, 2021, 7:03 PM IST

ప్రముఖ మీడియా సంస్థ 'దైనిక్ భాస్కర్‌' కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జైపుర్​, భోపాల్‌, అహ్మదాబాద్‌ సహా 30 ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ సంస్థ ప్రమోటర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. హిందీ మాధ్యమంలో వార్తలు ప్రసారం చేస్తున్న దైనిక్ భాస్కర్‌ ఇటీవల కరోనా రెండో వేవ్‌పై విమర్శనాత్మక కథనాలు ప్రచురించింది. ఈనేపథ్యంలో దైనిక్‌ భాస్కర్‌ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ కేంద్రంగా పనిచేసే హిందీ టీవీ ఛానల్​ భారత్​ సమాచార్​ మీడియా కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ ఎడిటర్​-ఇన్​-చీఫ్​, ప్రమోటర్స్​ ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే.. ఉత్తర్​ప్రదేశ్​ హరియా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అజయ్​ సింగ్​, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అయితే.. ఈ దాడులకు, మీడియా సంస్థల కార్యాలయాల్లో సోదాలకు సంబంధం ఉందా అనేదానిపై స్పష్టత లేదు.

విపక్షాల విమర్శలు..

మీడియా సంస్థలపై ఐటీ దాడులను రాజ్యసభలో లేవనెత్తాయి విపక్షాలు. పెగాసస్​ నిఘా వ్యవహారం సహా ఐటీ దాడులను తప్పుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఫలితంగా ఎగువసభ రెండుసార్లు వాయిదా పడింది.

మరోవైపు... ఐటీ దాడులను ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న క్రూరమైన దాడిగా పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

" జర్నలిజం, మీడియా సంస్థలపై దాడులు.. ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న క్రూరమైన దాడికి మరో ఉదాహరణ. నరేంద్ర మోదీ కొవిడ్​ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారని, దాంతో దేశం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లిందని.. దైనిక్​ భాస్కర్​ ధైర్యంగా కథనాలు ప్రచురించింది. మీడియాలో ఉన్నవారు బలంగా, ధైర్యంగా ఉండాలని కోరుతున్నా. కలిసి కట్టుగా ఉండటం వల్ల నిరంకుశ శక్తులకు విజయం దక్కదు. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

  • "ఈ సోదాలు మీడియాను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నమే. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరం. దీనికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళమెత్తాలి." అని అన్నారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

" దైనిక్​ భాస్కర్​ వార్తా పత్రిక​, భారత్​ సమాచార్​ న్యూస్​ ఛానల్​పై దాడులు.. మీడియా గొంతు నొక్కేందుకు చేసిన చర్యే. మోదీ ప్రభుత్వం తమపై వచ్చే అతి చిన్న విమర్శను కూడా సహించదు. అలాంటి క్రూరమైన ప్రవర్తనతోనే.. ప్రజాస్వామ్య విధానంలో నిజాన్ని చూడాలనుకోదు. "

- అశోక్​ గెహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

ప్రజాస్వామ్య నాలుగో స్తంభాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్​నాథ్​. నిజం బయటకు రాకుండా అధికార పక్షం అడ్డుంటోందని ఆరోపించారు. పెగాసస్​ గూఢచర్యంలోనూ.. చాలా మీడియా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉండే వ్యక్తులను పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు.

తిప్పికొట్టిన భాజపా..

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కుతున్నారన్న కాంగ్రెస్​ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది.

" రాజ్యాంగ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయి. అందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే మాట్లాడాలి. కొన్నిసార్లు చాలా విషయాలు నిజాలకు దూరంగా ఉంటాయి. "

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.