ETV Bharat / bharat

మైనారిటీల మానవహక్కులపై చర్చించా: ఆస్టిన్​

author img

By

Published : Mar 20, 2021, 10:44 PM IST

భారత్​లో మానవహక్కుల సమస్యలపై అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ స్పందించారు. ఈ విషయంపై భారత కేంద్రమంత్రులతో చర్చించినట్టు వెల్లడించారు. భాగస్వామ్య దేశాల మధ్య ఇలాంటి చర్చలు ఉండాలని పేర్కొన్నారు.

Issue of human rights of minorities discussed with Indian ministers: US Defence Secretary Austin
'ప్రజాస్వామ్య దేశంగా భారత్​ మానవహక్కుల్ని రక్షిస్తుంది'

భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణమంత్రి లాయిడ్​ ఆస్టిన్​.. దేశంలోని మైనారిటీల మానవహక్కుల సమస్యలపై మంత్రులతో చర్చించినట్టు తెలిపారు. ఇలాంటి చర్చలు భాగస్వామ్య దేశాల మధ్య ఉండాలని ఉద్ఘాటించారు.

అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం జరిగిన భేటీలో.. ఈ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు ఆస్టిన్​.

"ఈ విషయం(భారత్​లో మైనారిటీల మానవహక్కులు)పై మోదీతో మాట్లాడే అవకాశం నాకు లభించలేదు. కానీ.. ఇతర కేంద్రమంత్రులతో ఈ సమస్యపై చర్చించాను. భారత్​.. అమెరికా భాగస్వామ్య దేశం. ఈ భాగస్వామ్యానికి అగ్రరాజ్యం విలువనిస్తుంది. భాగస్వామ్య దేశాలుగా.. ఇలాంటి చర్చలు జరగడం ఉత్తమం. అర్థవంతమైన చర్చలతో సమస్యలపై పురోగతి సాధించవచ్చు. మానవహక్కులు, చట్టాలు అమెరికాకు ఎంతో ముఖ్యమని అధ్యక్షుడు జో బైడెన్​ ఎన్నో సార్లు అన్నారు. మా విలువలను దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు సాగుతాం. భారత్​ కూడా.. ఎన్నో విలువలున్న ప్రజాస్వామ్య దేశం. ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయి."

--- లాయిడ్​ ఆస్టిన్​, అమెరికా రక్షణమంత్రి.

పర్యటనలో భాగంగా.. భారత విదేశాంగమంత్రి జై శంకర్​, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​లతో భేటీ అయ్యారు ఆస్టిన్​. వివిధ అంశాలపై వీరు చర్చించారు.

ఈ సందర్భంగా.. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్ అంశం​పైనా స్పందించారు ఆస్టిన్​.

"భారత్​-చైనాలు యుద్ధం అంచున ఉన్నట్టు మేము ఎప్పుడూ భావించలేదు. నేను కూడా ఎప్పుడూ ఆ ఉద్దేశంతో లేను. మరోవైపు ఇండో-పసిఫిక్​లో శాంతి స్థాపనకు భారత్​-అమెరికా సరైన చర్యలే చేపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా మా వ్యూహం ఇలాగే కొనసాగుతుంది."

ఇదీ చదవండి: భారత్​కు చేరుకున్న అమెరికా రక్షణ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.