ISRO Deleted Vikram Lander Photos Twitter : చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో పోస్టు చేసింది. 'నేను నీపై నిఘా పెడతాను!' అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్లో ప్రస్తావించింది. 'చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్‌ను ఫొటోషూట్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC).. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న అత్యుత్తమ కెమెరా. 23/2³/23న ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్‌ను గుర్తించింది' అని ఇస్రో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్లను డిలీట్ చేసింది. అయితే, ఇస్రో ఎందుకు ఆ వాటిని డిలీట్ చేసిందో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
-
ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023
ప్రగ్యాన్ రోవర్ వీడియో విడుదల..
మరోవైపు, విక్రమ్ ల్యాండర్ పొట్టలో నుంచి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది. తన బుల్లి కాళ్లతో జారుకుంటూ వెళ్లిన రోవర్ వీడియో ఆకట్టుకుంటోంది.
-
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
Chandrayaan 3 Landed on Moon : 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ బుధవారం (2023 ఆగస్టు 23) జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవాప్తం చేసింది.
Chandrayaan 3 Landing Date And Time : బుధవారం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై దిగేందుకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ALS కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది. చివరి 17 నిమిషాల సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్.. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు జాబిల్లిపై అడుగుపెట్టింది.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమనౌక నిమిషాల వ్యవధిలోనే తన జోరుకు కళ్లెం వేసుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు.
చంద్రయాన్ 3 విజయంపై ప్రపంచం హర్షం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
Chandrayaan 3 Landing Success Wishes : చంద్రయాన్-3 సక్సెస్‌తో నా జీవితం ధన్యమైంది : ప్రధాని మోదీ