ETV Bharat / bharat

ISRO Chairman on Shivashakti Point : 'చంద్రుడి అద్భుతమైన ఫొటోలు మా వద్ద ఉన్నాయి'.. శివశక్తి పేరుపై ఇస్రో చీఫ్‌ క్లారిటీ

ISRO Chairman Somanath on Shivashakti Point : చంద్రుని ఉపరితలంపై ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. విక్రమ్‌ ల్యాండ్‌ అయిన ప్రాంతానికి ప్రధాని మోదీ శివశక్తి పేరును సూచించడాన్ని ఆయన సమర్థించారు.

isro-chairman-somanath-on-shivashakti-point-and-chandrayaan-3-lander-and-rover-works-on-moon
శివశక్తి పాయింట్‌పై ఇస్రో చైర్మన్ సోమనాథ్​
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 6:27 PM IST

Updated : Aug 28, 2023, 8:25 AM IST

ISRO Chairman Somanath on Shivashakti Point : చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఇతర దేశాల వద్ద ఉన్న వాటితో పోలిస్తే ఇస్రో వద్ద అత్యుత్తమ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ చక్కటి డేటాను అందిస్తోందని వివరించారు. ఫొటోలన్నీ ఇస్రో కంప్యూటర్‌ సెంటర్‌కు వెళుతున్నాయని, వాటిని తమ శాస్త్రవేత్తలు ప్రాసెస్‌ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే వాటిని బయటపెట్టనున్నట్లు చెప్పారు. రాబోయే 10 రోజుల్లో వివిధ మోడ్లలో నిర్ణయించుకున్న అన్ని ప్రయోగాలను మొత్తం సామర్థ్యంతో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ల పనితీరు చాలా బాగుందని స్పష్టం చేశారు. బోర్డులో ఉన్న 5 పరికరాలను స్విచ్ ఆన్ చేసినట్లు చెప్పారు.

Chandrayaan 3 Photos of Moon Isro : "రానున్న రోజుల్లో వివిధ పద్ధతుల్లో పరీక్షలు జరపాలి. రోవర్‌ వేర్వేరు ప్రదేశాల్లో అధ్యయనాలు జరపాలి. మినరాజికల్‌ నిర్ధరణ జరపాల్సి వచ్చినప్పుడు రోవర్‌ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతమంతా తిరిగి ప్రయోగాలు జరిపి ఆ డేటాను ఇక్కడకు పంపించాలి. చాలా ఫొటోలను తీయాల్సి ఉంటుంది. ఇస్రో దగ్గర చంద్రునికి సంబంధించిన బెస్ట్‌ ఫొటోలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర లేని దొరకని విశేషమైన ఫొటోలు ఉన్నాయి. వాటన్నింటినీ మెల్లమెల్లగా విడుదల చేస్తాము. అవన్నీ ఇస్రో కంప్యూటర్‌ సెంటర్‌కు వెళ్లాలి." అని ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ అన్నారు. శాస్త్రవేత్తలు వాటిని పరిశోధన చేస్తున్నారని.. వాటి కోసమే తాము వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Shivashakti Point on Moon : కేరళ తిరువనంతపురంలోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన సోమనాథ్‌.. సైన్స్‌, ఆధ్యాత్మికం 2 అంశాల పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు. అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు గల నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌ దిగిన చోటుకు ప్రధాని మోదీ.. శివశక్తి అని నామకరణం చేయడాన్ని ఇస్రో చీఫ్‌ సమర్థించారు. శివశక్తి, తిరంగా పేర్లు భారతీయతకు చిహ్నమని పేర్కొన్నారు. భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా ఉందని సోమనాథ్‌ స్పష్టం చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు. దానివల్ల అంతరిక్ష రంగంతోపాటు దేశం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని సోమనాథ్‌ వివరించారు.

Modi Mann Ki Baat : 'మహిళాశక్తికి 'చంద్రయాన్​-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'

Chandrayaan 3 Moon South Pole Temperature : చంద్రుడిపై ఉష్ణోగ్రతలు ఇలా.. ఇస్రో చేతికి తొలి నివేదిక

Last Updated : Aug 28, 2023, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.