ETV Bharat / bharat

Israel Palestine War : పాలస్తీనాకు 'ఇండియా' కూటమి నేతల సంఘీభావం.. దిల్లీలోని ఎంబసీకి వెళ్లి..

Israel Palestine War : దిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయానికి వెళ్లి ఆ దేశ ప్రజలకు సంఘీబావం తెలిపారు విపక్ష కూటమి 'ఇండియా' నేతలు. ఈ సందర్భంగా శాంతి కోసం ఎప్పుడూ గట్టిగానే పోరాడాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య వ్యాఖ్యానించారు.

Israel Palestine War
Israel Palestine War
author img

By PTI

Published : Oct 16, 2023, 5:00 PM IST

Updated : Oct 16, 2023, 5:10 PM IST

Israel Palestine War : ఇజ్రాయెల్​- హమాస్​ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలకు విపక్ష కూటమి 'ఇండియా' నేతలు సంఘీభావం తెలిపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్, జేడీయూ నేత కేసీ త్యాగి, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, బీఎస్​పీ ఎంపీ డానిష్ అలీ తదితరులు దిల్లీలోని పాలస్తీనా కార్యాలయానికి సోమవారం వెళ్లారు.

  • Several opposition leaders, including Mani Shankar Aiyar, Manoj Jha, KC Tyagi and others, issue a joint statement after meeting the Palestinian envoy in Delhi earlier today. pic.twitter.com/X7Mi7GsKfd

    — Press Trust of India (@PTI_News) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Israel Vs Palestine : గాజాలో మానవతా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలిపేందుకు ఆ దేశ రాయబార కార్యాలయానికి వచ్చినట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్​ భట్టాచార్య మీడియాకు తెలిపారు. "దేశంలోని ప్రతి చోట.. మేము ప్రజలతో గొంతు కలుపుతున్నాం. శాంతి కోసం ఎప్పుడూ గట్టిగానే పోరాడాలి. గాజాలో జరుగుతున్నది కేవలం విచక్షణారహిత దాడులు మాత్రమే కాదు. మూడో ప్రపంచ యుద్ధానికి పలు దేశాల్ని నెడుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌- బీజేపీ మాటల యుద్ధం!
Congress On Israel Palestine Conflict : ఇటీవలే జరిగిన కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణయ మండలి- CWC భేటీలో పాలస్తీనా పక్షాన నిలుస్తూ హస్తం పార్టీ తీర్మానం చేసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులకు, వారి స్వయంపాలనకు తాము మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ తీర్మానంపై భారతీయ జనతా పార్టీ భగ్గుమంది. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హమాస్‌ ఉగ్రవాదులకు ఆ పార్టీ మద్దతిస్తోందని విమర్శించింది. మోదీ ప్రధానిగా వచ్చేంత వరకు మైనారిటీ ఓట్ల కోసం భారత విదేశాంగ విధానం ఎలా ఉండేదో చెప్పడానికి సీడబ్ల్యూసీ తీర్మానమే ఒక ఉదాహరణ అని ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని తెలియజేశారు.

Israel Hamas War 2023 : పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధోన్మాదం.. రావణకాష్ఠం ఆగాలంటే భారత్‌ సూచనలే బెటర్​!

Hamas Secret Weapon : 'రహస్య ఆయుధం'తో హమాస్ దొంగదెబ్బ!.. ఇజ్రాయెల్​ను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్​! ​

Last Updated : Oct 16, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.