ETV Bharat / bharat

Kabul Attack: కాబుల్ దాడికి ఆర్​డీఎక్స్- పాకిస్థాన్ నుంచే! - కాబుల్ ఎయిర్​పోర్ట్ దాడి ఆర్​డీఎక్స్

ఉగ్రవాదులే కాదు.. ప్రమాదకరమైన పేలుడు పదార్థాల తయారీకీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది పాకిస్థాన్. ఆర్​డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్, నకిలీ ఏకే-47లు... ఇలా దాడులకు కావాల్సిన సామగ్రిని లేదనకుండా ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. ఐసిస్-కే చేసిన తాజా దాడుల్లో పాక్​లో తయారైన ఆర్​డీఎక్స్ మిశ్రమాన్నే వినియోగించినట్లు తేలింది.

ISIS (K) gets its explosives from Paks Quetta, Peshawar
కాబుల్ దాడి
author img

By

Published : Aug 28, 2021, 7:50 PM IST

Updated : Aug 28, 2021, 8:01 PM IST

'పాకిస్థాన్ మాకు రెండో ఇల్లు' అంటూ ఆ దేశంతో ఉన్న తమ అనుబంధాన్ని తాలిబన్(Taliban pakistan relations) ప్రతినిధులు ఇటీవలే బహిరంగంగా వెలిబుచ్చారు. అయితే, తాలిబన్లకే కాదు అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సొంతింటిగా వ్యవహరిస్తున్న విషయం తెలియందేం కాదు. ఇప్పుడు కాబుల్​లో జరిగిన ఉగ్రదాడిలోనూ పాకిస్థాన్ హస్తం బట్టబయలైంది.

గురువారం కాబుల్ ఎయిర్​పోర్ట్ సమీపంలో ఐసిస్-కే ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులు(isis kabul attack) జరిపింది. ఈ ఘటనలో 169 మంది అఫ్గాన్ పౌరులతో పాటు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారుల అంచనా ప్రకారం ఈ దాడిలో 11 కేజీల ఆర్​డీఎక్స్​ను ఉపయోగించారు.

దాడిలో ఉపయోగించిన మందుగుండు సామగ్రి అత్యంత ప్రమాదకరమైనది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్ సహా అమెరికా సైన్యం ధరించే అత్యుత్తమ రక్షణ సాధనాలను ధ్వంసం చేయగలిగే నాణ్యమైన పేలుడు పదార్థాలను ఇందులో ఉపయోగించారు. పేలుడు తీవ్రతను పెంచేందుకు అమ్మోనియం నైట్రేట్​ను ఆర్​డీఎక్స్​తో కలిపి ఉపయోగించినట్లు తెలుస్తోంది.

'ఐసిస్-కే'కు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి?

అయితే, ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఐసిస్​కు ఇలాంటి నాణ్యమైన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఈ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం.. 'పాకిస్థాన్'. అవును.. ఐసిస్-కే పాల్పడే దాడుల్లో చాలా వరకు పాకిస్థాన్​లో తయారైన పేలుడు పదార్థాలనే(rdx pakistan) వినియోగిస్తున్నారు. పెషావర్, క్వెట్టా నగరాల నుంచి బాంబులకు కావాల్సిన సామగ్రి ఐసిస్​కు సరఫరా అవుతోంది. తలకు చుట్టుకునే పాగాలలో, కూరగాయల బండ్లలో పేలుడు పదార్థాలను నింపి.. వాటిని సరిహద్దు దాటిస్తున్నారు. పేలుడు పదార్థాలతో పాటు డబ్బును సైతం(pakistan terror financing) ఇలాగే పంపిస్తున్నారు.

ఈ విషయాలన్నీ కాబుల్​లోని అఫ్గాన్ ఇన్​స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఏఐఎస్ఎస్) తన నివేదికలో వెల్లడించింది. అఫ్గానిస్థాన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పాటు ఐసిస్ ఉగ్రవాదులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదిక రూపొందించింది. ఇందులోని కీలకాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

  • ఐసిస్-కే సభ్యుల్లో 90 శాతం మంది పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​కు చెందినవారే. ఐసిస్-కే ఫైటర్లలో 'తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్​'కు చెందిన వారే అధికం.
  • ఐసిస్-కే ఉపయోగించే ఆయుధాలు, వాటి నాణ్యతను పరిశీలిస్తే.. భౌగోళికంగా దగ్గరగా ఉన్న దేశమే వీటిని సరఫరా చేసినట్లు స్పష్టమవుతోంది. వీటిపై ఐసిస్ సభ్యులను ప్రశ్నిస్తే.. తమ ఆయుధాలు పాకిస్థాన్​లో తయారయ్యాయని చెప్పారు.
  • ఏకే 47కు నకిలీలను తయారు చేసి అఫ్గాన్ వ్యాప్తంగా ఉన్న ఐసిస్-కేకు సప్లై చేస్తున్నారు. ఐసిస్​కు పాకిస్థాన్ అండగా ఉంటోందన్న విషయాన్ని ఇవన్నీ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం మాత్రం ఇలాంటి కార్యకలాపాలపై శీతకన్ను వేసింది.
  • నైట్రోజన్ ఆధారిత వ్యవసాయ ఫర్టిలైజర్లు.. మైనింగ్, నిర్మాణ రంగంలో వాడే అమ్మోనియం నైట్రేట్ వంటి​ రసాయనాలను పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆర్​డీఎక్స్​తో కలిపి వీటిని వినియోగించి పేలుడు తీవ్రతను పెంచుతున్నారు.
  • భారత్​లో అనేక ఉగ్రదాడులు ఈ విధంగానే జరిగాయి. పుల్వామా ఆత్మాహుతి దాడిలోనూ అమ్మోనియం నైట్రేట్-ఆర్​డీఎక్స్ మిశ్రమాన్నే ఉపయోగించారు.

ఐసిస్​-కే అంటే?

ఇస్లామిక్ స్టేక్​ ఖోరసన్​ ప్రావిన్స్(isis khorasan)... దీన్నే ఐసిస్​-కే, ఐసిస్​కేపీ, ఐఎస్​కే అని కూడా పిలుస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్​ ఇరాక్​, సిరియా(ఐసిస్​​) ఉగ్రసంస్థకు ఇది అనుబంధ సంస్థ. పాకిస్థానీ తాలిబన్​ మాజీ సభ్యులు, అఫ్గాన్ తాలిబన్​, ఉజ్బెకిస్థాన్​ ఇస్లామిక్​ ఉద్యమకారులు ఐసిస్​-కేను(isis-k leadership) 2015 జనవరిలో ఐసిస్​-కేను స్థాపించారు. అతి తక్కువ కాలంలో ఉత్తర, ఈశాన్య అఫ్గాన్​లోని గ్రామీణ జిల్లాలు సహా ప్రాదేశిక నియంత్రణను ఏకీకృతం చేసింది. మొదటి మూడేళ్లలో అఫ్గాన్, పాకిస్థాన్​లోని మైనారిటీ వర్గాలు, ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా దాడులతో రెచ్చిపోయింది. 2018 నాటికే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఉగ్రసంస్థల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇస్లామిక్ స్టేట్ ఉద్యమాన్ని మధ్య, దక్షిణాసియాకు విస్తరించడమే ఐసిస్​-కే లక్ష్యం.

భారత్​లోనూ ఐసిస్-కే విభాగం కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 మే 10న ఐసిస్​-కే నుంచి వేరువడి వలియాత్ అల్-హింద్ పేరుతో నడుస్తోంది. 2019 అక్టోబర్​లోనే ఈ ముఠా పూర్తిగా పతనమైందని జమ్ము కశ్మీర్ పోలీసులు ప్రకటించినా.. వీరు ఇంకా క్రియాశీలంగానే ఉన్నారని అనంతరం వెలువడిన పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి:

Last Updated : Aug 28, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.