ETV Bharat / bharat

టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా- మమత కోసమేనా?

బంగాల్ మంత్రి, సీనియర్​ నేత సోవన్​దేవ్​ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో భవానీపుర్​ నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. ఆ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసేందుకు వీలుగా సోవన్​దేవ్​ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

is tmc mla resigning for cm mamata benarjee?
టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా
author img

By

Published : May 21, 2021, 2:25 PM IST

Updated : May 21, 2021, 5:19 PM IST

బంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ సీనియర్ నేత సోవన్​దేవ్​ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను స్పీకర్​ బీమన్​ బెనర్జీకి సమర్పించారు.

is tmc mla resigning for cm mamata benarjee?
స్పీకర్​కు రాజీనామా పత్రాన్ని అందిస్తున్న సోవన్​దేవ్​

ఆయన స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది విచారించి సంతృప్తి చెందిన తర్వాతే రాజీనామా ఆమోదించినట్లు తెలిపారు సభాపతి.

కోల్​కతాలోని భవానీపుర్​ నియోజకవర్గం నుంచి సోవన్​దేవ్ మూడు వారాల క్రితమే ఎన్నికల్లో గెలిచారు.

ఎమ్మెల్యే సోవన్​దేవ్​ చటోపాధ్యాయ

మమత కోసమేనా?

నిజానికి భవానీపుర్​ మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. ఎన్నికల ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ స్థానాన్ని వీడి.. నందిగ్రామ్​ నుంచి పోటీ చేశారు. భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమత.. 6 నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఆమె పోటీ చేసేందుకు వీలుగా భవానీపుర్​ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి చటోపాధ్యాయ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Last Updated : May 21, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.