ETV Bharat / bharat

ఆర్ఎస్​ఎస్​, భాజపా మధ్య దూరం పెరిగిందా? - అసోంలో ఆర్ఎస్​ఎస్​, భాజపా మధ్య దూరం పెరిగిందా?

2014 నుంచి వరుస విజయాలు సాధిస్తూ... 'ఎన్నికల రాజకీయం'లో తనకు తానే సాటి అని అనిపించుకుంది భాజపా. ఈ జైత్రయాత్ర వెనుక ఆర్​ఎస్​ఎస్​ ఉందన్నది నిర్వివాదాంశం. క్షేత్రస్థాయి కార్యకర్తలతో పోలింగ్​ బూత్​లవారీగా ప్రజలను ఆకట్టుకునేందుకు సంఘ్​ అనుసరించే వ్యూహాలు ఎంతో ప్రత్యేకమైనవి. 2016లో ఇదే తరహాలో అసోంలో తొలిసారి కాషాయ జెండాను రెపరెపలాడించింది ఆర్​ఎస్​ఎస్​. కానీ.. ఈసారి మాత్రం ఆ సంస్థ ఎక్కడా కనిపించడంలేదు. భాజపా అభ్యర్థుల జాబితాలోనూ సంఘ్​ ప్రముఖులు ఎవరూ లేరు. ఎందుకిలా? అసోంలో ఆర్​ఎస్​ఎస్​కు, భాజపాకు మధ్య దూరం పెరిగిందా?

is-the-gap-widening-or-rss-losing-its-grip-on-bjp-in-assam
అసోంలో ఆర్ఎస్​ఎస్​, భాజపా మధ్య దూరం పెరిగిందా?
author img

By

Published : Mar 12, 2021, 5:44 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​)... దేశంలోని దాదాపు అందరికీ సుపరిచితమే. వంద సంవత్సరాలుగా దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఆర్​ఎస్​ఎస్​​ ముద్ర చెరగనిది. జనసంఘ్​, తరువాత భారతీయ జనతా పార్టీ పుట్టుకకు కారణం ఆర్​ఎస్​ఎస్​ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకాన్ని, కాంగ్రెస్​ కంచుకోటల్ని బద్దలుకొట్టి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంలో ఆర్​ఎస్​ఎస్​ కృషి ఎంతో ఉంది.

అసోంలో 2016లో 'కమలం' వికసించడానికి ఆర్​ఎస్​ఎస్​ ప్రచారక్​లు చేసిన కృషి అంతాఇంతా కాదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లిమరీ, భాజపాకు ఓట్లు పడేలా చేశారు. భాజపా అధికారంలోకి రావడానికి మూలకారణమయ్యారు.

ఇప్పుడు అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచార యజ్ఞంలో తలమునకలై ఉన్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ పార్టీ మాతృసంస్థ మాత్రం మౌనంగా ఉంది. ఎందుకిలా? ఆర్​ఎస్​ఎస్​కు, భాజపాకు మధ్య విభేదాలున్నాయన్న వార్తల్లో సత్యమెంత? ఆర్​ఎస్​ఎస్​ను భాజపా నిజంగానే పక్కన పెట్టిందా?

సీట్ల పంపకమే కారణమా?

ఈ ఊహాగానాలకు ఓ కారణం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, అసోం గణపరిషద్​(ఏజీపీ) మధ్య సీట్ల పంపకంతో ఆర్​ఎస్​ఎస్​, భాజపా మధ్య దూరం బాగా పెరిగిందని తెలుస్తోంది. ఈ విశ్లేషణలకు ఊతమిస్తూ... భాజపా తరఫున ప్రచారానికి ఆర్​ఎస్​ఎస్​ దూరంగా ఉంటోంది. 40 నియోజకవర్గాలకు భాజపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆర్​ఎస్​ఎస్​ మద్దతుదారులు ఒక్కరైనా లేకపోవడం ఇక్కడ గమనార్హం.

2016లో అలా... ఇప్పుడిలా...

2016 ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం వెనుక ఆర్​ఎస్​ఎస్​ పాత్ర ఎంతో ఉంది. అప్పటి అధికార కాంగ్రెస్​లోని అంతర్గత విభేదాలను అనుకూలంగా మలుచుకుని, భాజపాకు విజయబాటలు పరిచింది ఆర్​ఎస్​ఎస్​. కాంగ్రెస్​ సీనియర్ ​నేత, మంత్రి హిమంత బిశ్వ శర్మ 2016 ఎన్నికల ముందు భాజపాలో చేరడంలో కీలకంగా వ్యవహరించింది.

అలాంటి ఆర్​ఎస్ఎస్​తో దగ్గరి బంధం ఉన్న నేతలు 2021 ఎన్నికల్లో భాజపా టికెట్లు పొందలేకపోయారు. సంఘ్​ మద్దతుదారులైన కొందరు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకూ నిరాశే మిగిలింది. ఆర్ఎస్​ఎస్​ అనుబంధ సంస్థ అయిన​ 'స్పోర్ట్స్​ భారతి' అధ్యక్షుడు ప్రశాంత సైకియా.. దిగ్బోయి నియోజకవర్గం నుంచి టికెట్టు పొందలేక పోయారు.

ఏబీవీపీ మాజీ ప్రధాన కార్యదర్శి సిమంత దాస్​.. బోకో సీటు ఆశించినా భాజపా ఇవ్వలేదు. అసోం, అరుణాచల్​ప్రదేశ్​లో సంఘ్​ ప్రచారక్​గా ఎన్నో ఏళ్లు సేవలందించిన జగదీశ్​ గుప్తాకూ టికెట్టు దక్కలేదు. ఆయన అడిగిన నవోబోయిచ్చ స్థానాన్ని ఏజీపీకి కేటాయించడం గమనార్హం.

సంఘ్​ ప్రచారక్​గా సేవలందించిన సౌమిత్ర పుజారీ సోదరుడు ఎస్​ శంతను పుజారీకి కూడా టికెట్టు ఇవ్వలేదు. సంఘ్​ ప్రచారక్​ హిమంత ధింగ్​ మజుందర్​ సోదరుడు రంజిత్​ మజుందర్​కూ నిరాశే ఎదురైంది. సంఘ్​లో పనిచేసిన, మాజీ లోక్​సభ ఎంపీ రమేశ్​ దేఖా పేరు కూడా భాజపా విడుదల చేసిన జాబితాలో లేదు. 2019 లోక్​సభ ఎన్నికలప్పుడు కూడా దేఖాకు టికెట్టు ఇవ్వలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా నిరాశే మిగిలింది. దేఖా అప్పట్లో జనసంఘ్​ సభ్యుడు కావడం గమనార్హం.

(రచయిత-నయన్​ జ్యోతి, ఈటీవీ భారత్​ అసోం బ్యూరో చీఫ్​)

ఇదీ చదవండి: 'భారత్​ నుంచి విడిపోయిన ఏ దేశం సంతోషంగా లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.