ETV Bharat / bharat

మహంత శకం ముగిసినట్లేనా? - అసోం గణ పరిషద్

అసోం రాజకీయాలను, మాజీ సీఎం ప్రపుల్ల కుమార్ మహంతను వేర్వేరుగా చూడలేం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మహంత ఉనికిని తాజా ఎన్నికలు ప్రశ్నార్థకంగా మార్చాయి. తాను స్థాపించి, నిలబెట్టిన పార్టీయే తనకు టికెట్ నిరాకరించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దఫా పోటీ నుంచి ఆయన వైదొలిగారు.

Mahanta
ప్రపుల్ల కుమార్ మహంత
author img

By

Published : Apr 3, 2021, 2:18 PM IST

అసోం రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ సీఎం ప్రపుల్ల కుమార్ మహంత ఉనికిని తాజా ఎన్నికలు ప్రశ్నార్థకంగా మార్చాయి! తాను స్థాపించి, నిలబెట్టిన పార్టీయే తనకు టికెట్ నిరాకరించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దఫా పోటీ నుంచి ఆయన వైదొలిగారు. రాష్ట్రంలో మహంత శకం ముగిసిందని చెప్పేందుకు తాజా పరిణామం స్పష్టమైన సంకేతమా? లేదంటే గోడకు కొట్టిన బంతిలా ఆయన మళ్లీ దూసుకొస్తారా?

Mahanta
ప్రపుల్ల కుమార్ మహంత

ఉవ్వెత్తున దూసుకొచ్చి

అసోం రాజకీయాలను, మహంతను వేర్వేరుగా చూడలేం. ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన నేత ఆయన. 1952 డిసెంబరు 28న జన్మించారు. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు), ఆల్ అసోం గణ సంగ్రామ పరిషద్ (ఏఏజీఎస్ పీ)ల ఆధ్వర్యంలో 1979 నుంచి ఆరేళ్లపాటు అసోం ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. 1985లో అసోం గణ పరిషద్ (ఏజీపీ)ను స్థాపించారు. దేశ చరిత్రలో స్వల్ప వ్యవధిలో విజయవంతమైన ప్రాంతీయ పార్టీల్లో అదొకటి. ఫలితంగా 1985లోనే ముఖ్యమంత్రిగా మహంత బాధ్యతలు చేపట్టారు. దేశంలోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డుల్లో కెక్కారు.

ఎన్నెన్నో వివాదాలు

రాజకీయ జీవితంలో మహంత అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 1985-90 మధ్య యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) వంటి నిషేధిత సంస్థల కార్యకలాపాలు భారీగా పెరగడంతో ఆయనకు కఠిన పరీక్ష ఎదురైంది. మహంత సీఎంగా ఉన్నప్పుడే.. తిరుగుబాట్లను అణచివేసేందుకు భారత సైన్యం అస్సాంలో ఆపరేషన్ బజరంగ్, ఆపరేషన్ రైనో వంటివి చేపట్టింది. వాటితో పరిస్థితులు సద్దుమణగలేదు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. ప్రభుత్వమే హత్యలు చేయిస్తోందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా 1991 ఎన్నికల్లో ఏజీపీ పరాజయం పాలైనా.. తర్వాతి ఎన్ని కల్లో (1996) సత్తా చాటింది. మహంత మళ్లీ సీఎం పీఠమెక్కారు. రెండో దఫా పదవీ కాలంలోనూ ఆయన్ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. పరాగ్ కుమార్ దాస్ అనే పాత్రికేయుడి హత్యోదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. కేంద్రం, రాష్ట్రం చేతులు కలిపి పలువురు ఉల్ఫా సభ్యులను రహస్యంగా హతమార్చాయని ఆరోపణలొచ్చాయి. రాష్ట్రంలో హోంశాఖను మహంత అట్టి పెట్టుకోవడంతో అందరూ ఆయన వైపే వేలెత్తి చూపారు. 2001 ఎన్నికల్లో పరాజయంతో ఏజీపీ అధికారం కోల్పోయింది. 2005లో ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఏజీపీ (ప్రోగ్రెసివ్) పేరుతో మహంత కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. అయితే- 2008లో తిరిగి దాన్ని ఏజీపీలో విలీనం చేశారు.

1991 నుంచీ అదే సీటు

మహంత 1991 నుంచి బహ్రంపుర్ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. ఈ దఫా కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, పార్టీ టికెట్ నిరాకరించింది. భాజపాతో జట్టు కట్టిన ఏజీపీ.. పంపకాల్లో భాగంగా బహ్రంపుర్ సీటును కమలనాథులకు అప్పగించింది. తన భర్త వేరే పార్టీ టికెట్పై పోటీ చేస్తారని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతారని మహంత భార్య కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఆయన మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకు న్నారు. పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు

పార్టీ నాయకత్వంతో విభేదాలు

నిజానికి మహంతకు ఏజీపీ టికెట్ నిరాకరించడం ఆశ్చర్యకర నిర్ణయమేమీ కాదు! పార్టీ నాయకత్వంతో ఆయనకు చాన్నాళ్లుగా విభేదాలున్నాయి, అందుకే ఆయన్ను పార్టీ దూరం పెడుతూ వస్తోంది. శాసనసభా పక్ష సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. 2016లో భాజపాతో ఏజీపీ చేతులు కలపడాన్ని మహంత వ్యతిరేకించారు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏజీపీ సమర్థించింది. మహంత మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇదీ చదవండి: అసోం పోరులో ప్రజలను ఏజీపీ మెప్పించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.