ETV Bharat / bharat

Iron Poles On Train Track : రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర.. ట్రాక్​పై ఇనుప స్తంభాలు పెట్టి..

Iron Poles On Train Track In Gujarat : రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్​పై ఇనుప స్తంభాలను ఉంచారు. దీన్ని గమనించి అప్రమత్తమైన లోకో పైలట్​ రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అనతంరం ఈ విషయంపై అధికారులకు సమచారం అందిచాడు లోకో పైలట్.

Iron Poles On Train Track In Gujarat
Iron Poles On Train Track In Gujarat
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 12:42 PM IST

Updated : Aug 29, 2023, 1:19 PM IST

Iron Poles On Train Track In Gujarat : అహ్మదాబాద్​-పురీ రైలుతో పాటు మరో ట్రైన్​కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. అయితే లోకో పైలట్​ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Iron Poles On Train Track In Gujarat
రైలు పట్టాలకు అడ్డంగా పెట్టిన ఇనుప రాడ్డు

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్​ల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ మార్గంలో రైలును పట్టాలు తప్పించడానికి దుండగులు కుట్ర పన్నారు. అందులో భాగంగా పట్టాలపై ఇనుప ఫెన్సింగ్​ స్తంభాన్ని ఉంచారు. ఆదివారం రాత్రి అదే మార్గంలో వస్తున్న ఓఖా-షాలీమార్​ రైలు ఆ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలుకు ఏం కాలేదు. అదే మార్గంలో వస్తున్న అహ్మదాబాద్​-పురీ రైలు లోకో పైలట్​ ఆ స్తంభాలను గమనించి.. రైలును నిలిపివేశాడు. అనంతరం ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్​కు సమచారం అందించాడు. ఆ తర్వాత స్టేషన్​ మాస్టర్​ కంట్రోల్​కు విషయం చేరవేశాడు. రైల్వే శాఖ వెంటనే అధికారులను, పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Iron Poles On Train Track In Gujarat
రైలు పట్టాలను పరిశీలిస్తున్న అధికారులు
Iron Poles On Train Track In Gujarat
వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్​ల మధ్య ట్రాక్​

మాటలకు అందని విషాదం..
Odisha Train Accident : ఈ ఏజాది జూన్​ 2న ఒడిశా.. బాలేశ్వర్​లో షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్​ను ఢీకొట్టగా పెను ప్రమాదం జరిగింది. గూడ్స్​ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను బెంగళూరు- హవ్​డా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టగా.. ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా గత నెలలో బాలేశ్వర్​ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్​ జిల్లాలో విధులు నిర్వర్తించారు.

ఆ సెట్టింగ్స్​ మార్చడం వల్లే ఇంతటి ఘోరం! ఎవరి పని? రంగంలోకి NIA?

'రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఒడిశా రైలు దుర్ఘటన.. అలా చేసి ఉంటే ప్రమాదం తప్పేది'

Last Updated : Aug 29, 2023, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.