ETV Bharat / bharat

ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్​ చేసే వీలు.. కానీ ఓ షరతు! - ఐఆర్​సీటీసీ ట్రైన్​ టికెట్​ బుకింగ్స్​

IRCTC train booking: ట్రైన్​ టికెట్​ బుక్సింగ్​లో ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితులను పెంచింది కేంద్రం. ఐఆర్​సీటీసీ యూజర్​ ఐడీతో ఆధార్​ లింక్​ చేసిన వారు నెలకు గరిష్ఠంగా 24 టికెట్లు బుక్​ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఆధార్​తో అనుసంధానం చేయనివారు 12 టికెట్లు మాత్రమే బుక్​ చేసుకోవచ్చు.

irctc train booking
ట్రైన్​ టికెట్​ బుక్సింగ్​
author img

By

Published : Jun 6, 2022, 3:07 PM IST

IRCTC train booking: ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, యాప్​ ద్వారా ట్రైన్​ టికెట్లు కొనుగోలు ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఐఆర్​సీటీసీ ఐడీతో ఆధార్​ లింక్​ చేసిన వారు.. వెబ్​సైట్​, యాప్​ ద్వారా ఇకపై నెలకు 24 ట్రైన్​ టికెట్లు బుక్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆధార్​ లింక్​ కానీ వారు 12 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజమ్​ కార్పొరేషన్​(ఐఆర్​సీటీసీ) ద్వారా ఆధార్​ లింక్​ కాని వారు ఆరు టికెట్లు, ఆధార్​ అనుసంధానం చేసుకున్న వారు 12 టికెట్లు బుక్​ చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం ఆ పరిమితిని పెంచింది.

" ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్​సీటీసీ యూజర్​ ఐడీతో ఆధార్​ అనుసంధానించని ఖాతా ద్వారా ఇప్పటి వరకు ఉన్న గరిష్ఠ పరిమితి 6 టికెట్ల నుంచి 12 టికెట్లకు పెంచింది. ఆధార్​ అనుసంధానించిన ఖాతా ద్వారా ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితి 12 నుంచి 24 టికెట్లకు పెంచింది. ఐఆర్​సీటీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులను ఆధార్​తో ధ్రువీకరించేందుకు వీలుంటుంది."

- రైల్వే శాఖ

ఈ నిర్ణయాన్ని పలువురు ఉన్నతాధికారులు స్వాగతించారు. తరచుగా ప్రయాణాలు చేసేవారు, ఒకే ఖాతా నుంచి కుటుంబం మొత్తానికి టికెట్లు బుక్​ చేసే వారికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధార్​ లింక్​ చేయటం ద్వారా ఒకే ఖాతా నుంచి నెలకు 24 టికెట్లు కొనుగోలు చేసే వీలు కలుగటం వల్ల ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు.

ఇదీ చూడండి: పిల్లల కోసం ప్రత్యేక బెర్త్​.. రైల్వే శాఖ సరికొత్త ప్రయోగం!

Indian Railways: పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు.. 'భారత్​ గౌరవ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.