ETV Bharat / bharat

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా? - ఐఆర్​సీటీసీ తాజా వార్తలు

IRCTC Hyderabad to Tirumala Tour Package : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెళ్లాలనుకునేవారికి ఐఆర్​సీటీసీ టూరిజం గుడ్​న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tirumal
Tirupathi
author img

By

Published : Aug 19, 2023, 12:33 PM IST

IRCTC Hyderabad to Tirumala Tour Package : మీరు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్​సీటీసీ) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. "గోవిందం" పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతి స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్​సీటీసీ వెల్లడించింది.

Govindam Tirupati Tour Package : 'గోవిందం' పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్​లో భాగంగా తిరుపతి, తిరుమలలోని బాలాజీ ప్రధాన ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయాలు కవర్ అవుతాయి. అలాగే.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్(Tirumala Special Entry Darshanam) కూడా ఈ టూర్ ప్యాకేజీలో అందిస్తారు. హైదరాబాద్​లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ తర్వాత మరో స్టాప్​గా నల్గొండ రైల్వేస్టేషన్ మాత్రమే ఉంటుంది.​ ఈ మూడు స్టేషన్​లలో ఎక్కడ ఎక్కాలనుకుంటే అక్కడ ఎక్కొచ్చు.

టూర్ సాగనుందిలా..

మొదటిరోజు : హైదరాబాద్​లోని లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ట్రైన్ బయలుదేరుతుంది. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు వెళుతుంది. రాత్రి 7 గంటల 38 నిమిషాలకు బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.

Vande Bharat Express : 16 బోగీలతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రెండో రోజు : తిరుపతి(Tirupati)కి రెండో రోజు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు రైలు చేరుకుంటుంది. అక్కడ ప్రయాణికులను ఐఆర్​సీటీసీ వాళ్లు పికప్​ చేసుకుని.. త్రీ స్టార్ హోటల్​కి తీసుకెళ్తారు. అక్కడ ఏసీ రూమ్ సౌకర్యం కల్పిస్తారు. అనంతరం హోటల్లో ఫ్రెష్ అప్, టిఫెన్ అయిన తర్వాత.. ఉదయం 8 గంటల సమయంలో తిరుమల(Tirumala) శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనానికి తీసుకెళ్తారు. అక్కడ దర్శనం అనంతరం హోటల్​కు చేరుకుని లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక అదే రోజు సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్(Tirupati Railway Station) నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు రాత్రంతా జర్నీలో ఉంటారు.

మూడో రోజు : తిరుగుప్రయాణంలో మూడోరోజు ఉదయం 3గంటల 4 నిమిషాలకు నల్గొండకు చేరుకుంటారు. 5గంటల 35 నిమిషాలకు సికింద్రాబాద్, 6 గంటల 55 నిమిషాలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ చేరుకోవడంతో మీ టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు ఇవీ..

  • ఈ "గోవిందం" టూర్ ప్యాకేజీ(Govindam Tour Package) లో టికెట్ ధరగా.. ఒక్కరికి 3,800 రూపాయలుగా నిర్ణయించారు.
  • 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు ఈ టూర్​లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
  • కాకపోతే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
  • ప్రతి ఒక్కరూ ఒరిజినల్ ఆధార్​కార్డు కలిగి ఉండాలి.

TTD Varalakshmi Vratham Tickets : తిరుమలలో వరలక్ష్మీ వ్రతం.. టికెట్లు విడుదల.. బుక్​ చేసుకోండిలా

How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.