ETV Bharat / bharat

షిరిడీ భక్తుల కోసం IRCTC రెండు సూపర్​ ప్యాకేజీలు - అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ​

IRCTC Hyderabad To Shirdi Tour Packages Full Details : షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునేవారికి IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. సాయి సన్నిధి ఎక్స్​ హైదరాబాద్, సాయి శివం పేర్లతో.. అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజెస్ అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

IRCTC Hyderabad To Shirdi Tour Packages Details
IRCTC Hyderabad To Shirdi Tour Packages Full Details
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 12:29 PM IST

IRCTC Hyderabad To Shirdi Tour Packages Full Details : తక్కువ ధరలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగానే.. హైదరాబాద్​ టూ షిరిడీ రెండు ప్యాకేజీలను అనౌన్స్​ చేసింది. సాయి సన్నిధి ఎక్స్​ హైదరాబాద్, సాయి శివం​ పేర్లతో IRCTC టూరిజం ఈ టూర్లను ఆపరేట్​ చేస్తోంది. మరి ఈ టూర్లు ఎన్ని రోజులు సాగుతాయి..? టికెట్ల ధర ఎంత..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Sai Sannidhi Ex Hyderabad Tour Full Details: సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) టూర్‌ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా.. ఇది 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్​ ప్యాకేజీ ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.

IRCTC Divya Dakshin Yatra and How to Book Online: ఐఆర్​సీటీసీ సరికొత్త ప్యాకేజీ.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఇప్పుడే బుక్ చేసుకోండిలా.!

ఐఆర్‌సీటీసీ ‘సాయి సన్నిధి’ ప్రయాణం ఇలా..

  • మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:50 గంటలకు ట్రైన్ (అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళుతుంది. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వ‌డం.. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం ఉంటుంది. అక్క‌డ నుంచి శని శింగణాపూర్ బయలుదేరుతారు. శని ఆలయం దర్శనం అనంత‌రం నాగర్‌సోల్‌కు బయలుదేరుతారు. తిరుగు ప్ర‌యాణం నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 09:20 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధర:

  • స్టాండర్డ్ క్లాస్​లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8,510 డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,840, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3,710గా ధర నిర్ణయించారు.
  • కంఫర్ట్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,100గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,400గా నిర్ణయించారు.
  • ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం, శని శింగణాపూర్, రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి.

How To Book Entire Coach In Train : ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారా?.. తక్కువ ధరకే మొత్తం కోచ్​నే బుక్ చేసుకోండిలా!

ఆన్​లైన్​ టికెట్​ ఎలా బుక్​ చేసుకోవాలంటే..?

  • ముందుగా IRCTC అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. https://www.irctctourism.com/
  • హోమ్​ పేజీలో Tour Packages ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అనంతరం West India Packages ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
  • తర్వాత SAI SANNIDHI EX HYDERABADలో Book Now ఆప్షన్​పై క్లిక్​ చేసి పూర్తి వివరాలను ఎంటర్​ చేసి టికెట్​ బుక్​ చేసుకోవాలి.

సాయి శివం టూర్​ ప్యాకేజీ పూర్తి వివరాలు:

Sai Shivam Tour Package Full Details: సాయి శివం (Sai Shivam) టూర్​ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్​ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్​ ప్యాకేజీ ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.

How To Change Train Journey Date : ట్రైన్​ జర్నీ​ తేదీ మార్చాలా?.. పై క్లాస్​కు అప్​గ్రేడ్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ఐఆర్‌సీటీసీ ‘సాయి శివం’ ప్రయాణం ఇలా..

  • మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 06:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064(అజంతా ఎక్స్‌ప్రెస్)​లో ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే బస చేయాలి.
  • మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్​ వెళ్లాలి. అక్కడ త్రయంబకేశ్వర్, పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్​ టికెట్​ను ఈజీగా ట్రాన్స్​ఫర్ చేసుకోండిలా?

టూర్ ప్యాకేజీ ధర:

  • స్టాండర్డ్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,730 డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,910గా ధర నిర్ణయించారు.
  • కంఫర్ట్ క్లాస్‌లో.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,420గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,230, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6590గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శన స్థలాలకు ఏసీ వాహనంలో తీసుకెళ్తారు. అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని సందర్శనా స్థలాలు కవర్ అవుతాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా ఏదైనా కావాలంటే వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి.

  • తర్వాత Sai Shivamలో Book Now ఆప్షన్​పై క్లిక్​ చేసి పూర్తి వివరాలను ఎంటర్​ చేసి టికెట్​ బుక్​ చేసుకోవాలి.

Best 5 Train Ticket Booking Apps : ఆన్​లైన్​లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

Travel in Third AC Class with Sleeper Ticket : వావ్.. సూపర్ స్కీమ్! స్లీపర్ క్లాస్ టికెట్‌తో.. ఫ్రీగా థర్డ్ ఏసీ జర్నీ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.