ETV Bharat / bharat

విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ - జామ్​నగర్​లో గోవా మాస్కో విమానం ల్యాండింగ్

ఓ అంతర్జాతీయ విమానాన్ని బాంబు బేదిరింపుతో గుజరాత్​లోని జామ్​నగర్​ ఎయిర్​పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఏం లభించలేదని.. టేకాఫ్​కు క్లియరెన్స్​ ఇచ్చామని అధికారులు తెలిపారు.

International Flight Emergency landed
International Flight Emergency landed
author img

By

Published : Jan 9, 2023, 10:55 PM IST

Updated : Jan 10, 2023, 11:37 AM IST

బాంబు బెదిరింపుతో జామ్​నగర్​ ఎయిర్​పోర్టులో ​అత్యవసరంగా ల్యాండ్​ అయిన అంతర్జాతీయ విమానంలో బాంబు లేదని అధికారులు గుర్తించారు. అతి కేవంల బెదిరింపు కాల్​ మాత్రమే అని తేల్చారు. ఈ మేరకు జామ్​నగర్​ కలెక్టర్ వివరాలు​ వెల్లడించారు. "ఎన్​ఎస్​జీ టీమ్​, పోలీసులు, బాంబ్​ డిస్పోజల్​ స్క్వాడ్​ బృందాలతో.. విమానాన్ని, ప్రయాణికులను, అందులో ఉన్న బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాము. ఈ తనిఖీలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9.50 గంటల వరకు కొనసాగించాము. అందులో అనుమానాదాస్పదంగా ఏం లభ్యం కాలేదు. గోవా వెళ్లేందుకు ఆ విమానానికి క్లియరెన్స్​ ఇచ్చాము. అందులో ఉన్న ప్రయాణికులు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు" అని కలెక్టర్ తెలిపారు.

సోమవారం అజుర్​ ఎయిర్​కు చెందిన అంతర్జాతీయ విమానాన్ని గుజరాత్​లోని జామ్​నగర్​ ఎయిర్​పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపు రావడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జామ్​నగర్​ పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు సమాచారం అందడం వల్ల వెంటనే అప్రమత్తమైన అక్కడి జిల్లా కలెక్టర్​తో పాటు మిగతా పోలీసు అధికారులు విమానాశ్రాయానికి చేరుకున్నారు. వెంటనే ప్లేన్​ను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేలా అదేశాలు జారీ చేశారు. దీంతో అందులో ఉన్న 236 ప్రయాణికుల ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్​పోర్ట్ లాంజ్​లో వీరు ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Last Updated : Jan 10, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.