ETV Bharat / bharat

రైతు ఆందోళనల్లో ఉగ్రదాడి.. దిల్లీలో హై అలర్ట్​!

జూన్​ 26న దిల్లీలో రైతులు చేపట్టనున్న ఆందోళనల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

high alert
హై అలర్ట్
author img

By

Published : Jun 26, 2021, 9:27 AM IST

రైతు ఉద్యమం ప్రారంభమై ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా జూన్​ 26(శనివారం)న దిల్లీలో రైతు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. రైతుల ఆందోళనల్లో పాకిస్థాన్​ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐ ఆధ్వర్యంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. మెట్రో స్టేషన్లను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరకు మూసివేయనున్నారు.

సేవ్ అగ్రికల్చర్​ అండ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నిరసనల్లో ఇతర రైతు సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అంతకు ముందు రైతులనుద్దేశించి మాట్లాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. ఉద్యమాన్ని విరమించాలని రైతులను కోరారు.

ఇదీ చదవండి : 'రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.