ETV Bharat / bharat

'మసాజ్​సెంటర్​లో సీసీటీవీతో వ్యక్తిగత గోప్యతకు భంగమే' - మద్రాస్​ హైకోర్టు

CCTV in Spa: మసాజ్​ సెంటర్​లో సీసీటీవీ ఏర్పాటు చేయడం గోప్యతకు భంగం కలిగించడమేనని పేర్కొంది మద్రాస్​ హైకోర్టు. ఇందుకు సంబంధించి మంగళవారం చేపట్టిన విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనుమానంగా ఉందని సీసీటీవీలు ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొంది.

CCTV in Spa
మసాజ్​సెంటర్​లో సీసీటీవీ
author img

By

Published : Jan 5, 2022, 9:04 PM IST

CCTV in Spa: మసాజ్ ​సెంటర్​లో సీసీటీవీ ఏర్పాటును తప్పుపట్టింది మద్రాస్​ హైకోర్టు. అది వచ్చిన వారి వ్యక్తిగత గోప్యత, హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది. సీసీటీవీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21ను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్​ జీఆర్​ స్వామినాథన్​ ఆధ్వర్యంలోని మదురై​ బెంచ్​ వ్యాఖ్యానించింది.

ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగిస్తూ సీసీటీవీ ఏర్పాటు చేయాలంటే అందుకు బలమైన కారణం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కేవలం అనుమానం ఉందన్న కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని తెలిపింది.

కేసు వివరాలు..

మసాజ్​ సెంటర్​లలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని సంబంధిత యజమాని ఆదేశించినట్లు సమాచారం అందుకున్న తిరుచిరాపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిపై యజమాని కోర్టును ఆశ్రయించాడు. తనకు నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​ ఇప్పించమని తిరుచిరాపల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్​లో పేర్కొన్నాడు.

ఇదీ చూడండి : బోరు బావి నుంచి వంటగ్యాస్​- ఈ ఫ్యామిలీ ఎంత లక్కీనో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.