ETV Bharat / bharat

కరోనాను జయించి ఎవరెస్టును అధిరోహించిన సాహసి - మహారాష్ట్ర పాల్​ఘర్​ జిల్లా వార్తలు

ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవాలనే అతని లక్ష్యానికి కరోనా అడ్డుపడలేకపోయింది. ఆత్మవిశ్వాసంతో వైరస్​ను జయించి శిఖరంపై జాతీయ జెండా పాతాడు. 25 ఏళ్ల వయసులో యువతీ యువకులంతా ఉద్యోగాలు, డబ్బు వెంట పరిగెడుతుంటే.. ఎవరెస్టు ఎక్కి తన లక్ష్యాన్ని చేరుకున్న హర్షవర్ధన్ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మారుమూల గ్రామాలకు సౌరవిద్యుత్‌ను చేరువచేసే చిరాగ్ ప్రాజెక్టుకు యూత్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు.

inspiring youth everest, vasai man climbs everest
కరోనాను జయించి ఎవరెస్టును అధిరోహించిన సాహసి
author img

By

Published : Jun 10, 2021, 7:27 PM IST

కరోనాను జయించి ఎవరెస్టును అధిరోహించిన సాహసి

మహారాష్ట్ర పాల్‌ఘర్‌లోని వాసాయ్‌లో పుట్టిపెరిగాడు హర్షవర్ధన్ జోషి. వృత్తిరీత్యా ఐటీ ఇంజినీర్. చిన్నప్పటి నుంచీ వీడియో గేమ్స్ అంటే ఇష్టపడే ఈ కుర్రాడి జీవితాన్ని.. 2011లో స్థానికంగా ఓ కొండనెక్కిన అనుభవం మలుపు తిప్పింది. తర్వాతే పర్వతారోహణపై మక్కువ పెరిగింది. ఏదో ఒకరోజు ఎవరెస్టు శిఖరంపై అడుగుపెట్టాలని 2015లో లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొద్ది కాలం శిక్షణ తీసుకుని, ఒంటరిగానే మౌంట్ స్టాక్ కంగ్రీని అధిరోహించి, ఆ పర్వతం ఎక్కిన మొదటి 20 ఏళ్ల లోపు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

6వేల మీటర్ల ఎత్తున్న 11శిఖరాలపై అడుగుపెట్టి.. పర్వతారోహణలో నైపుణ్యాలను సాన బెట్టుకున్నాడు హర్షవర్ధన్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో కఠిన సాధన చేశాడు. అందులో భాగంగా 2018లో లద్దాఖ్‌ వెళ్లి, మౌంటేన్ గైడ్‌గా పనిచేశాడు. అలా పర్వతాలపై విస్తృత అనుభవం సంపాదించాడు. ఎత్తైన ప్రదేశాలపై తనకున్న భయాలను ఆ కొండలూ, గుట్టలే తొలగించాయని చెప్తాడు హర్షవర్ధన్.

లాక్​డౌన్​ అడ్డుకాలేదు..

లాక్‌డౌన్ కారణంగా సాధనకూ, తన ఆశయానికీ హర్షవర్ధన్ కొంతకాలం దూరం కావాల్సి వచ్చింది. అయినా ఖాళీగా కూర్చోకుండా, ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌పై దృష్టి పెట్టాడు. సైక్లింగ్, పరుగు మొదలు పెట్టాడు. మార్చిలో గోవాలో జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌లో పాల్గొన్నా డు. అక్కడ హర్షవర్థన్‌ను చూసిన కాలిఫోర్నియాకు చెందిన ఓ కోచ్.. ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఐరన్ మ్యాన్ ట్రయథ్లెట్‌గా నిలవలేకపోయినా సరైన శిక్షణ, నేపథ్యం లేనివాళ్లు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొనవచ్చన్న సందేశమిచ్చాడు హర్షవర్ధన్.

25 ఏళ్ల వయసులో యువతీ యువకులంతా ఉద్యోగాలు, డబ్బు వెంట పరిగెడుతుంటే, ఎవరెస్టు ఎక్కి, తన లక్ష్యం చేరుకున్నాడు హర్షవర్ధన్. బేస్‌ క్యాంప్‌లో ఉండగా, కొవిడ్ బారిన పడినా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, వెనకడుగు వేయలేదు. ఏప్రిల్ 6న కాఠ్‌మాండులో మొదలు పెట్టి, మే 23న శిఖరంపై జాతీయ జెండా పాతాడు. ప్రయాణంలో పునరుత్పాదక, సౌరశక్తి ఆధారిత పరికరాలనే వినియోగించాడు.

వారి సహకారంతో..

గ్రామాల్లో సౌరశక్తి వినియోగం పెంచేందుకు కృషి చేస్తున్న చిరాగ్ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్..CRDF హర్షవర్ధన్‌కు సహకారం అందించింది. తన పర్వతారోహణ వెనక.. నేపాల్‌లోని విద్యుత్‌ లేని మారుమూల ప్రాంతాలకు సౌరశక్తిని అందుబాటులోకి తేవాలన్న ఆశయం కూడా ఉంది. 11 ఏళ్లలో దేశంలోని 11 రాష్ట్రాల్లో 522 గ్రామాలకు సౌరవిద్యుత్‌ను చేరువ చేసింది చిరాగ్ ప్రాజెక్టు. ఈ సంస్థతో చేతులు కలిపాడు హర్షవర్ధన్. ఆ ప్రాజెక్టుకు యూత్ అంబాసిడర్‌గానూ నిలబడ్డాడు.

తన ఆశయ సాధనలో భాగంగా, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ నినాదాలనూ ప్రచారం చేశాడు హర్షవర్ధన్. విద్యుత్ వెలుగులు లేని గ్రామాలకు సౌరవిద్యుత్ తీసుకొచ్చే లక్ష్యం కోసం విరాళాలూ సేకరించాడు. రైట్‌ టు లైట్ హక్కును అందరూ పొందాలన్నదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని చెబుతున్నాడు.

ఇదీ చదవండి : ఫుడ్​ డెలివరీ గర్ల్​గా ఇంటర్​ అమ్మాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.