ETV Bharat / bharat

పిల్లల ఉన్నత చదువుకు 'రేఖ' పొదుపు పథకం - కర్ణాటక పాఠశాలలో రేఖ పొదుపు పథకం

పిల్లల భవిష్యత్తు​ కోసం తల్లిదండ్రులు డబ్బులు పొదుపు చేస్తారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు మాత్రం.. తానే ఆ బాధ్యతను తీసుకున్నారు. పిల్లల ఉన్నత చదువుకు ఉపయోగపడేలా ఓ పొదుపు పథకం ప్రారంభించారు ఆమె. చిన్నప్పటినుంచీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. పిల్లల విషయంలో అలా జరగకూడదని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఆ పథకమేంటో తెలుసా..!

Rekha Teacher
రేఖ మేడం
author img

By

Published : Apr 30, 2021, 12:07 PM IST

చిన్నారుల ఉన్నత చదువుకు టీచర్ తాపత్రయం

చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదీ, ఉపాధ్యాయుడిదీ దాదాపు సమప్రాధాన్యం ఉండే పాత్ర. ఏ విద్యార్థి బంగారు భవిష్యత్తైనా ఉపాధ్యాయుడి చేతుల్లోనే రూపుదిద్దుకుంటుంది. విద్యార్థుల మేలు కోసమే ఉపాధ్యాయులెప్పుడూ కృషిచేస్తారు. వారి ఆలోచనలెప్పుడూ పిల్లల బాగోగులపైనే ఉంటాయి. అలాంటి ఉత్తమ లక్షణాలున్న ఉపాధ్యాయురాలే కర్ణాటకకు చెందిన రేఖ. చిన్నారులకు ఉపయోగపడేలా ఓ వినూత్న పథకాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టిందామె. రాష్ట్ర ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.సురేష్ కుమార్‌ అభినందనలు అందుకుందీ ఉపాధ్యాయురాలు. అసలు ఆ పథకమేంటో ఆమె మాటల్లోనే విందాం.

"విద్యార్థి పేరు మీద డబ్బు పొదుపు చేసే పథకం ప్రారంభించాను. మొదటి తరగతిలో పేరు నమోదు చేసుకున్న విద్యార్థి పేరుమీద 2014లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశాం. ఈ ఏడాది 13 మంది విద్యార్థులు ఈ పథకంలో చేరారు. గత విద్యా సంవత్సరంలో 15 మంది పథకంలో చేరారు. 2014 నుంచి 63 మందికి ఈ పథకం లబ్ధి చేకూరేలా చేశాను."

- రేఖ, ఉపాధ్యాయురాలు

ప్రతిఒక్కరికీ విద్య అత్యవసరం. ప్రాథమిక విద్య చిన్నారి భవిష్యత్తుకు పునాది లాంటిది. ఉపాధ్యాయులు, ఆటపాటలు, చిన్ననాటి స్నేహితులు జీవితాంతం గుర్తుండిపోతారు. ఆ వయసులో పిల్లలకు మంచి విద్యనందించడం సహా.. ఉన్నత చదువులకోసం ఉపయోగపడేలా ఈ పొదుపు పథకం ప్రారంభించింది రేఖా టీచర్. ప్రస్తుతం శివమొగ్గ జిల్లాలోని నూలిగెరి ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది రేఖ. మొదటి తరగతిలో చేరిన చిన్నారుల పేరు మీద 1000 రూపాయలు డిపాజిట్ చేస్తుంది. ఎస్​ఎస్​ఎల్​సీకి వెళ్లే సమయంలో ఈ డబ్బుకు కొంత మొత్తం కలిపి ఇచ్చేస్తుంది.

"ఒక్కసారి విద్యార్థికి 10 ఏళ్లు వచ్చిన తర్వాత ఎస్​ఎస్​ఎల్​సీ పొందేందుకు ఈ చిన్న మొత్తం వాళ్లకు ఎంతో దోహదం చేస్తుంది. ఎస్​ఎస్​ఎల్​సీలో అడ్మిషన్ పొందేందుకు ఈ డబ్బు చాలకపోయినా.. ప్రాథమిక విద్య తర్వాత ఉన్నత విద్యకు వెళ్లేందుకు చిన్నారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించాన్నేను. పిల్లల మేలు కోసం నా తరఫున చిన్న సహాయమిది."

- రేఖ, ఉపాధ్యాయురాలు

చిన్నప్పటినుంచీ రేఖ పేదరికంతో సతమతమైంది. ఆ పరిస్థితులే ఆమెను చిన్నారుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టేలా చేసింది. 2014లో విధుల్లో చేరినప్పటి నుంచి, ఈ పథకంలో 63 మంది చిన్నారులను చేర్పించింది రేఖ. ఆమె కృషిని చూసి విద్యాశాఖ మంత్రి ప్రశంసించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలకు బదిలీ అయి వెళ్లినా.. అక్కడా దీన్ని కొనసాగించాలనుకుంటోంది రేఖ. ప్రతి పని నుంచీ డబ్బు సంపాదించాలనుకునేవారే అంతటా కనిపిస్తారు. కానీ చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి ఓ పథకం ప్రారంభించి, చిన్నవయసులోనే ఆర్థిక క్రమశిక్షణ అలవడేలా చేస్తున్న రేఖా టీచర్‌ను మనమంతా అభినందించాల్సిందే.

ఇదీ చూడండి: కరోనా బాధితులకు అండగా 'ఆదర్శ కుటుంబం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.